OnePlus Smart Phone Offers 2023 : చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ టెక్నాలజీస్ తన 10వ వార్షికోత్సవం సందర్భంగా.. తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తోంది. ఈ వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ఈ డిసెంబర్ 17 వరకు అందుబాటులో ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం వన్‌ప్లస్ అందిస్తున్న బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకుందాం.
OnePlus Pad Discount : వన్‌ప్లస్ కంపెనీ విడుదల చేసిన ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఇది. మార్కెట్లో దీని ధర రూ.35,499 వరకు ఉంటుంది. కానీ దీనిని వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో కేవలం రూ.30,499లకే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5000 డిస్కౌంట్‌తో ఈ ట్యాబ్లెట్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు.
OnePlus Nord CE3 5G Discount :ఈ మిడ్ రేంజ్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర మార్కెట్లో రూ.24,999 వరకు ఉంటుంది. కానీ ఈ కమ్యూనిటీ సేల్‌లో దీనిని కేవలం రూ.22,999కే అందిస్తున్నారు. అంటే కస్టమర్లకు రూ.2,000 వరకు ఆదా అవుతుంది.
OnePlus Buds Pro 2 Discount :మార్కెట్లో ఈ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 ధర రూ.8,999 వరకు ఉంటుంది. వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో దీనిపై రూ.1000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే మీరు కేవలం రూ.7,999లకే ఈ వన్‌ప్లస్ బడ్స్ ప్రో2ను సొంతం చేసుకోవచ్చు. ఈ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2లో.. యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, డైనాడియో ట్యూనింగ్ లాంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. పైగా ఇది 39 గంటల ఆడియో ప్లేబ్యాక్ టైమ్ కలిగి ఉంటుంది. మ్యూజిక్ లవర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
OnePlus Bullet Z2 Wireless Discount :మార్కెట్లో ఈ వన్‌ప్లస్ బుల్లెట్ జెడ్2 వైర్లెస్ నెక్‌బ్యాండ్ ధర రూ.1,499 వరకు ఉంటుంది. కానీ ఈ కమ్యూనిటీ సేల్‌లో దీనిని కేవలం రూ.1,349కే కొనుగోలు చేయవచ్చు. ఈ నెక్ బ్యాండ్ వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్స్తో సహా అన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. పైగా దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.