ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత్‌లో బడ్జెట్ ధరలో 5జీ మోడల్‌ను ఆవిష్కరించనుంది. 'నార్డ్ సీఈ 5జీ' పేరుతో ఈ మోడల్‌ను భారత్‌తో పాటే ఐరోపా మార్కెట్లలోనూ ఈ నెల 10న విడుదల చేయనుంది. విడుదలకు ముందే కొత్త మోడల్‌కు సంబంధించిన పలు ఫీచర్లు, డిజైన్‌ను రివీల్ చేసింది వన్‌ప్లస్.
64 మెగా పిక్సెళ్ల ప్రధాన కెమెరాతో వెనుకవైపు మొత్తం మూడు కెమెరాలు ఉండనున్నట్లు తెలిపింది. ముందు వైపు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, వార్ప్ ఛార్జింగ్ 30టీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ మోడల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇతర ఫీచర్ల అంచనాలు..
- 6.43 అంగుళాల అమోలోడ్, ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్
- 16 మెగా పిక్సెళ్ల పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్