చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ భారత మార్కెట్లోకి త్వరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. గత ఏడాది ఆగస్టులో విడుదలైన నార్ట్ మోడల్‌కు కొనసాగింపుగా నార్డ్-2 5జీ(Oneplus nord 2) పేరుతో ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి రానుంది. టెక్ వర్గాల ప్రకారం జులై 24న ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 2 ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
ధర ఎంతనేది చెప్పనప్పటికీ.. పలు ఇతర వివరాలను మాత్రం కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. నార్డ్ 2 మొబైల్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో రానున్నట్లు తెలిపింది. వన్ ప్లస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన మొబైళ్లన్నింటిలో క్వాల్కమ్ ప్రాసెసర్‌ను వాడగా.. తొలిసారి నార్డ్ 2 ఫోన్లో మీడియా టెక్ చిప్‌సెట్‌ను వినియోగిస్తుండటం గమనార్హం.
ఫీచర్ల అంచనాలు..
- 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఆమోలోడ్ డిస్ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ (కంపెనీ అధికారికంగా వెల్లడించింది)
- వెనుకవైపు మూడు కెమెరాలు (50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ)
- 32 మెగా పిక్సెల్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా
- ఆండ్రాయిడ్ 11 ఓఎస్
- 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ
- 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్
- అలర్ట్ స్లైడర్
- ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్
ఇదీ చదవండి:నాయిస్ నుంచి చౌకైన స్మార్ట్ వాచ్- ఫీచర్లు ఇవే..