స్మార్ట్ ఫోన్ పేలుడు వార్తలను ఇటీవలి కాలంలో అప్పడప్పుడు వింటూనే ఉన్నాం. ఛార్జింగ్ పెట్టే సమయంలోనో.. లేదా ఫోన్ తయారీలో ఏదైనా లోపాలతో ఇలాంటి పేలుడు సంభవిస్తుందని వినికిడి. అయితే ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఒకటి బెంగళూరులో జరిగింది. మొబైల్ కొన్న ఐదు రోజులకే ఇలా జరగడం గమనార్హం.
ఏం జరిగిందంటే?
బెంగళూరుకు చెందిన అంకుర్ శర్మ అనే వ్యక్తి సతీమణి ఇటీవలే వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసింది. ఫోన్ తన బ్యాగ్‌లో పెట్టుకొని సైక్లింగ్‌కు వెళ్లగా.. అది ఒక్కసారిగా పేలిందని అంకుర్ ట్వీట్ చేశారు. బ్యాగ్‌లో నుంచి పొగలు రావడం వల్ల తన భార్య ప్రమాదానికి గురైందని ఆరోపించారు. దీంతో పాటు పేలిన ఫోన్ ఫొటోలనూ షేర్ చేశారు. దీనిపై వన్‌ప్లస్ సపోర్ట్ అధికారక ట్విట్టర్ ఖాతా స్పందించింది.
"హాయ్ అంకుర్.. ఫోన్ పేలిందన్న వార్త పట్ల మేము చింతిస్తున్నాం. మీరు ఈ విషయాన్ని మాకు నేరుగా తెలియజేయండి. మేము మీ స్మార్ట్‌ఫోన్‌ను రీప్లేస్ చేస్తాం" అని వన్‌ప్లస్ రీట్వీట్ చేసింది. అయితే వెంటనే అంకుర్ తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు. వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ పేలడం ఇది తొలిసారి కాదు. 2019 జులైలో తొలిసారి వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ పేలింది.
ఇదీ చూడండి..ఈ నెలలోనే మార్కెట్లోకి నార్డ్-2 5జీ ఫోన్- ఫీచర్లు ఇవే..