చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ ఒకేసారి పెద్ద ఎత్తున కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. వన్‌ప్లస్ 8 సరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వన్ ప్లస్ 9ను ఆవిష్కరించింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లలో ఒకేసారి మూడు మోడళ్లను విడుదల చేసింది.
వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9ప్రో, వన్ ప్లస్ 9ఆర్ పేర్లతో ఈ మోడళ్లను తీసుకొచ్చింది. ఈ మూడు ఫోన్లు 5జీ వేరియంట్లు కావడం గమనార్హం. మూడు కొత్త ఫోన్లతో పాటు తొలి స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది వన్‌ప్లస్.
వన్‌ప్లస్ 9 ఫీచర్లు, ధర..
- 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
- వెనుకవైపు మూడు కెమెరాలు(48 ఎంపీ ప్రధాన కెమెరా+50 ఎంపీ అల్ట్రావైడ్+2ఎంపీ మోనో క్రోమ్)
- 16 ఎంపీ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా
- 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ (వైర్), 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ (వైర్లెస్)
- ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్
- 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999
- 12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999
వన్‌ప్లస్ 9 ప్రో ఫీచర్లు, ధర..
- 6.7 అంగుళాల క్యూ హెచ్డీ డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
- వెనుకవైపు నాలుగు కెమెరాలు(48 ఎంపీ ప్రధాన కెమెరా+50 ఎంపీ అల్ట్రావైడ్+8 ఎంపీ టెలిఫోటోలెన్స్+ 2ఎంపీ మోనో క్రోమ్)
- 16 ఎంపీ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా
- 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ (వైర్), 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ (వైర్లెస్)
- ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్
- 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999
- 12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999