OnePlus 12 Launched In China : వన్ప్లస్ స్మార్ట్ఫోన్ అభిమానులకు గుడ్ న్యూస్. చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం వన్ప్లస్ మంగళవారం తమ స్వదేశంలో ఫ్లాగ్షిప్ ప్రీమియం 5జీ స్మార్ట్ఫోన్ వన్ప్లస్ 12ని లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ జెన్3 చిప్సెట్, 2కె అమోలెడ్ ఎల్టీపీఓ స్క్రీన్, 5,400mAh బ్యాటరీ సహా పలు సూపర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
OnePlus 12 Features :
- డిస్ప్లే - 6.7 అంగుళాల QHD+ సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే
- ప్రాసెసర్ - క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 Soc
- ర్యామ్- 24జీబీ
- స్టోరేజ్ - 1టీబీ స్టోరేజ్
- బ్యాటరీ- 5400mAh బ్యాటరీ
- ఫాస్ట్ ఛార్జింగ్ - 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- వైర్లెస్ ఛార్జింగ్ - 50W
- ఓఎస్- ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్
- కనెక్టివిటీ- 5జీ, 4జీ LTE, వై-ఫై, బ్లూటూత్ V5.3, NFC, GPS, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.
- రియర్ కెమెరా - 50MP + 48MP+ 64MP ట్రిపుల్ రియర్ కెమెరాస్
- ఫ్రంట్ కెమెరా- 32MP
OnePlus 12 Color Options : వన్ప్లస్ స్మార్ట్ఫోన్ లీవ్ బ్లాంక్(వైట్), గ్రీన్, ఇవాగురో (బ్లాక్) కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
OnePlus 12 Specs :ఈ స్మార్ట్ఫోన్ కలర్ ఓఎస్ 14తో పనిచేస్తుంది. దీనిలో లార్జెస్ట్ కూలింగ్ సిస్టమ్ ఉంది. కనుక హెవీ గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కదు. అందువల్ల లాంగ్ డ్యురేషన్ గేమ్స్ కూడా హాయిగా ఆడుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే దీనిలో సోనీ ఎల్వైటీ-808 సెన్సార్ ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టు కలిగి ఉంటుంది. కనుక చాలా హై-క్వాలిటీ వీడియోలు, ఫొటోలు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది.