స్మార్ట్ ఫోన్ల కంపెనీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యాపిల్, సామ్సంగ్, షావోమి, వన్‌ప్లస్ లాంటి కంపెనీలు కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నాయి. అందులో ముఖ్యంగా వన్+ కంపెనీ కొద్ది రోజులుగా మొబైల్ ఫోన్లు కాకుండా ఇతర ఉపకరణాలపై దృష్టిసారించింది. ఇటీవల ఈ సంస్థ టీడబ్ల్యూఎస్ (ట్రూ వైర్లెస్ స్టీరియో) ఇయర్ బర్డ్స్, కొత్త మానిటర్లు, టీవీలు తదితర పరికరాలను ఆవిష్కరించింది. కాగా, మొబైల్ ఫోన్లకు ఫేమస్ అయిన ఈ సంస్థ నుంచి ఇప్పుడు మరో కొత్త ప్రొడక్ట్ రాబోతుంది. అదే 100 వాట్ సామర్థ్యం కలిగిన ఛార్జర్.
వన్ ప్లస్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు :
ఈ వన్ ప్లస్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీకి ఓ యూనిక్ ఫీచర్ ఉంది. అదే డ్యూయల్ పోర్ట్ సూపర్ ఫ్లస్ ఛార్జింగ్ సదుపాయం. ఈ ఛార్జర్లో రెండు పోర్టులుంటాయి. అందులో ఒకటి యూఎస్బీ-ఏ కాగా, మరొకటి టైప్‌సీ పోర్టు. ఈ రెండింటినీ ఒకే సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఈ ఛార్జర్ 65 వాట్స్ పీడీ(పవర్ డెలివరీ) సామర్థ్యం కలిగి ఉన్నట్లు సమాచారం.