ఆకాశం నుంచి భూమిని చూస్తే కలిగే అనుభూతే వేరు. విమానాలు, హాట్ఎయిర్ బెలూన్లతో ఓ మోస్తారు ఎత్తు నుంచి చూసే ఉంటారు. అయితే లక్ష అడుగల ఎత్తులో.. శూన్యం నుంచి భూమిని చూడాలని ఉందా? అంతరిక్షపు అంచులను తాకాలనుకుంటున్నారా? ఆ అవకాశాన్ని కల్పిస్తోంది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సంస్థ స్పేస్ పర్స్పెక్టివ్.
స్పేస్‌షిప్ నెప్ట్యూన్‌ను అంతరిక్ష పర్యటనకు సిద్ధం చేస్తోంది స్పేస్ పర్స్పెక్టివ్. హాట్ఎయిర్ బెలూన్ తరహాలో ఉండే ఈ హైటెక్ అంతరిక్ష నౌకలో ఒక పైలట్‌తో పాటు 8 మంది వరకు యాత్రికులు వెళ్లొచ్చు. అందులో బార్‌తో పాటు పరిసరాలను ఆస్వాదించేలా విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి:అంతరిక్ష వీధిలో వేసవి సెలవులు గడపొచ్చు!
ఎంత సేపు ప్రయాణం..
ఈ ప్రయాణం మొత్తం 6 గంటలు. భూమికి లక్ష అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు 2 గంటలు.. అక్కడ క్యాబిన్లో 360 డిగ్రీల్లో దృశ్యాలను వీక్షించేందుకు యాత్రికులకు ఓ 2 గంటలు.. తిరుగు పయనంలో సముద్రంలో నౌకపై స్పేస్ షిప్ దిగడానికి మరో 2 రెండు గంటల సమయం పడుతుంది.
2024లో తొలి స్పేస్ షిప్‌ను అంతరిక్ష పర్యటనకు పంపేందుకు స్పేస్ పర్స్పెక్టివ్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే తొలి ఫ్లైట్లను అమెరికాలోని ఫ్లోరిడాలోనే మొదలుపెట్టనున్న సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా లాంచింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని భావిస్తోంది.
ఇదీ చూడండి:అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ల కోసం పోటీ!