తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. రకరకాల ఫీచర్లు యాడ్ చేసుకుంటూ మెసేజింగ్‌ను మరింత సులువుగా, భద్రంగా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూప్‌లకు సంబంధించిన మరికొన్ని ఫీచర్లు తీసుకురాబోతోంది.
ఒకరికన్నా ఎక్కువ మందితో సమాచారాన్ని పంచుకునేందుకు చేసుకునేందుకు, అభిప్రాయాల్ని తెలియజేసేందుకు వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేస్తారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఒకే విషయాన్ని వేర్వేరు గ్రూప్‌లలో షేర్ చేస్తారు కొందరు గ్రూప్ సభ్యులు. అలా చేయడం విసుగు తెప్పిస్తుంది. ఇలాంటి గ్రూప్‌లకు అడ్మిన్లుగా ఉన్నావారికి.. ఆ మెసేజ్‌లను హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. అలాంటి సమస్యలకు పరిష్కారంగా కొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకురాబోతుంది. ఆ ఫీచర్లు ఏంటి? వాటితో యూజర్లుకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చూద్దాం.
ప్రైవసీ ఫీచర్..
గ్రూప్‌లో జాయిన్ అయ్యే లింక్‌ను షేర్ చేసినప్పుడు, గ్రూప్‌ను కమ్యూనిటీలో చేరేలా చేసినప్పుడు.. గ్రూప్‌లోకి అనుమతించాలనుకునే వ్యక్తులను అడ్మిన్లు సులభంగా ఎంచుకోవడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది. దీంతో ఎవరు పడితే వారు గ్రూపుల్లో చేరలేరు. ఎలాంటి అనవసర వ్యాఖ్యానాలు చేయడానికి వీలుండదు. దీనివల్ల గ్రూప్‌ను సురక్షితంగా ఉంచడం ఈజీ అవుతుంది.
కామన్ ఇన్ గ్రూప్స్..
ఎవరైన ఒక వ్యక్తి మనతో పాటు ఏయే గ్రూపుల్లో ఉన్నాడో సులభంగా తెలుసుకోవచ్చు. అతడి పేరును సెర్చ్ చేస్తే అతడు, ఏయే గ్రూప్‌ల్లో కామన్‌గా ఉన్నారో లిస్టు వస్తుంది.
అయితే, ఈ ఫీచర్లు త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి
ఇంతకుముందు వాట్సాప్ తీసుకొచ్చి కొన్ని ముఖ్యమైన గ్రూప్ ఫీచర్లు:
ఒకే గ్రూప్‌లో 1024 మంది
గ్రూప్ సభ్యుల గరిష్ట సంఖ్యను 1024కు వాట్సాప్ పెంచింది. దీంతో ఒకేసారి ఎక్కువ మందితో సమాచారాన్ని సులువుగా షేర్ చేసుకోవచ్చు.
గ్రూప్ కాలింగ్
అంతకుముందు వరకు వాట్సాప్‌లో ఒకేసారి ఎనిమిది మంది మాత్రమే వీడియో కాల్లో మాట్లాడే అవకాశం ఉండేది. అప్డేట్తో ఈ సంఖ్యను 32 మందికి పెంచింది. కాగా, వాట్సాప్‌లో వీడియోకాల్ ఫీచర్ వచ్చిన తొలినాళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొనే అవకాశం ఉండేది. తర్వాత ఆ సంఖ్యను వరుసుగా నాలుగు, ఎనిమిదికి పెంచగా పెంచారు. ఇప్పుడు ఆ సంఖ్య 32కు చేరింది.
వాట్సాప్‌లో పోల్
సాధారణంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు.. ఎక్కువ మంది గ్రూప్ సభ్యుల అభిప్రాయం తెలుసుకుంటారు. ఇలాంటి సమయాల్లో వాట్సాప్‌లో మెసేజ్ పెడితే ఎవరూ సరైన రెస్పాన్స్ ఇవ్వరు. ఆ సమస్యను తీర్చేలా వాట్సాప్ ఇన్-చాట్ పోల్స్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది సంస్థ. ఇందులో మొత్తంగా 12 ఆప్షన్లు ఉంటాయి. గ్రూప్ అడ్మిన్ పోల్ క్రియేట్ చేసి సభ్యులతో షేర్ చేస్తారు. అది సభ్యులకు షేర్ చేస్తే.. వారు తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంపిక చేసి పోల్‌లో పాల్గొంటారు. ఈ ఫీచర్ కోసం అడ్మిన్లు ఫైల్ అటాచ్ అనే ఐకాన్‌పై క్లిక్ చేస్తే.. పోల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి మనకు నచ్చిన పోల్ క్రియేట్ చేసుకోవచ్చు.
వీటితో పాటు.. గ్రూప్‌ల్లో ఇతర సభ్యులు చేసిన మెసేజ్‌లను గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేసేలా పర్మిషన్స్‌లో మార్పులు చేసింది. గ్రూప్ నుంచి ఎవరైనా బయటకు వెళితే(ఎగ్జిట్) గ్రూప్ అడ్మిన్‌కు సోటిఫికేషన్ వెళ్లేలా ఫీచర్ తీసుకొచ్చింది.