తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

2023లో మార్కెట్​లోకి 49 నయా కార్లు.. ఈ ఐదు SUVలు హైలైట్​!

వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త కార్లను వివిధ కంపెనీలు మార్కెట్​లోకి ప్రవేశపెటనున్నాయి. అలా 2023లో మొత్తం 49 కొత్త కార్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ మోడళ్లు ఏంటి? ఏ కంపెనీ చెందినవి? వంటి వివరాలు తెలుసుకుందాం.

new-car-launch-in-india-2023-and-upcoming-cars-in-india-2023
2023లో కొత్తగా లాంఛ్​ అయ్యే కార్లు

By

Published : Mar 30, 2023, 5:55 PM IST

Updated : Mar 30, 2023, 6:23 PM IST

కొత్త కార్లు కొనాలనుకునే వారికి గుడ్​న్యూస్​! 2023లో మొత్తం 49 కొత్త కార్లు మార్కెట్​లో లాంఛ్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో SUV, వాన్, కూపేలు ఉన్నాయి. 29 SUVలు, 6 MUVలు, 8 సెడాన్లు, 2 హ్యాచ్‌బ్యాక్‌లు, 4 కూప్​లను 2023లో విడుదల చేసేందుకు ఆయా కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో విడుదల అయ్యే ప్రముఖ కారు మోడళ్లను చూద్దాం.

1. టాటా పంచ్​ సీఎన్​జీ..
2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పోలో.. 'ఆల్ట్రోజ్‌ సీఎన్​జీ'తో పాటు 'టాటా పంచ్​ సీఎన్​జీ' కూడా కొత్తగా అరంగ్రేటం చేసింది. ఈ సంవత్సరం చివర్లో భారీ స్థాయిలో టాటా పంచ్​ సీఎన్​జీ కార్లను కంపెనీ విడుదల చేయనుంది. ఈ కారును 1.2 లీటర్లు ఇంధన సామర్థ్యంతో తయారుచేశారు. ఐదు మాన్యువల్ ట్రాన్స్​మిషన్ గేర్లు ఇందులో ఉంటాయి. రెండు సీఎన్​జీ ట్యాంక్​లు ఉండటం ఈ కారు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

టాటా పంచ్​ సీఎన్​జీ

2. కియా సోనెట్​ సీఎన్​జీ..
కియా సోనెట్ సీఎన్​జీ కార్ల మోడల్​ కూడా కొద్దికాలంలోనే లాంఛ్​ కానుంది. ఒక లీటర్​ ఇంజన్​ సామర్థంలో ఈ కారును రూపొందించింది కంపెనీ. ఈ మధ్యకాలంలో మార్కెట్​లోకి విడుదలైన 'మారుతీ సుజుకీ బ్రీజా సీఎన్​జీ'కి.. 'కియా సోనెట్ సీఎన్​జీ' కారు పోటీగా నిలువనుంది.

కియా సోనెట్​ సీఎన్​జీ

3. హ్యుందాయ్ ఏఐ3..
మరికొద్ది నెలల్లోనే ఈ మైక్రో ఎస్​యూవీ కారు మార్కెట్​లోకి ఆరంగ్రేటం చేయనుంది. ఇది టాటా పంచ్​తో పోటీ పడనుంది. దీన్ని 'గ్రాండ్ ఐ10 నియోస్' మోడల్​కి మాడిఫైడ్​ వెర్షన్​గా తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. హ్యుందాయ్ ఏఐ3ని.. 1.2 లీటర్​ ఇంజిన్​ సామర్థంతో తయారుచేశారు. ఇది పెట్రోల్​తో నడుస్తుంది.

4. మారుతీ సుజుకీ జిమ్ని..
2023 మేలో ఈ కారు మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది. ఈ కారులో తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. 1.5 లీటర్​​.. నాలుగు-సిలిండర్ K15B పెట్రోల్ ఇంజన్​తో ఈ కారును రూపొందించారు. కారుకు మొత్తం ఐదు గేర్లు ఉంటాయి. అందులో నాలుగు ఆటో ట్రాన్స్​ఫార్మింగ్​ గేర్లు ఉంటాయి.

మారుతీ సుజుకీ జిమ్ని..

5. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్..
వచ్చే నెలలో ఈ కారును విడుదల చేసేందుకు మారుతి కంపెనీ సన్నాహలు చేస్తోంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ను.. బాలెనో మోడల్​ ఆధారంగా కంపెనీ రూపొందించింది. 1.2 లీటర్ల పెట్రోల్​ ఇంజన్​తో.. లేదంటే ఒక లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజన్​తో ఈ కారును తయారుచేసే అవకాశాలు ఉన్నాయి.

6. ఎమ్​జీ కామెట్..
ఈ కారుకు రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. పట్టణ ప్రాంత వినియోగదారులే లక్ష్యంగా ఎమ్​జీ కామెట్ కారును సంస్థ రూపొందించింది. ఈ సంవత్సరం మధ్యలో 'ఎమ్​జీ కామెట్' మార్కెట్​లోకి విడుదల కానుంది. ఇండోనేసియాలో అమ్మే ఊలింగ్ ఎయిర్ ఈవీ ఆధారంగా ఈ కారును తయారుచేశారు. ఈ చిన్న ఎలక్ట్రిక్​ కారు.. 20-25 కిలో వాట్​ అవర్​ బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఎమ్​జీ కామెట్ ప్రారంభ షోరూం ధర పది లక్షల రూపాయలుగా ఉండవచ్చు.

7. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్..
ఈ ఫేస్​లిఫ్ట్ కియా సెల్టోస్​ కారు 2023 సంవత్సరం మధ్యలో లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కారుపై ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షలు సైతం పూర్తయ్యాయి. దీన్ని 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ సామర్ధంతో తయారు చేశారు. ఇందులో అడ్వాన్స్​డ్​ డ్రైవర్​ అసిస్టెంట్​ సిస్టమ్​ కూడా ఉంది.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్.

8. లెక్సస్ ఆర్​ఎక్స్​..
మరికొద్ది రోజుల్లోనే ఈ కారు మార్కెట్​లోకి విడుదల కానుంది. 2.5 లీటర్​ స్ట్రాంగ్​ హైబ్రిడ్​ ఇంజన్​ సామర్థంతో ఈ కారును తయారుచేశారు. లేటెస్ట్​ డిజైన్​, సౌకర్యాలతో ఈ కారును రూపొందించారు. వైర్​లెస్​ చార్జర్​, 14 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి.

Last Updated : Mar 30, 2023, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details