తమ చందాదారులకు మరింత వినోదం పంచేందుకు ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఓ గేమింగ్ యాప్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ ప్లేతో పాటు.. యాప్ స్టోర్‌లోనూ దీనిని అందుబాటులోకి తీసుకురానుంది.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి అదనపు ఛార్జీలు లేకుండానే వీడియో గేమ్స్‌ను అందించే యోచనలో ఉంది నెట్‌ఫ్లిక్స్. అయితే ఈ సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయో వెల్లడించలేదు. కార్యకలాపాల విస్తరణలో భాగంగానే సొంతంగా వీడియో గేమ్‌లను రూపొందించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
ఛార్జీల పెంపు..
అయితే.. ఇటీవలి కాలంలో ఛార్జీలను పెంచిన నెట్‌ఫ్లిక్స్.. వీడియోగేమ్స్ యాప్ ద్వారా మరోసారి పెంచే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికా, కెనడాల్లో 16శాతం మేర చందా ధరలను పెంచింది. ప్రస్తుతం టీవీ సిరీస్, సినిమాలకు లైసెన్స్ ఇవ్వకుండా సొంతంగా కంటెంట్‌ను రూపొందిస్తోంది నెట్‌ఫ్లిక్స్.
ప్రథమార్థం డీలా..
ఈ మధ్యకాలంలో నెట్‌ఫ్లిక్స్ యూజర్ల సంఖ్య తగ్గినప్పటికీ.. ఇతర ఓటీటీలు వాల్ట్ డిస్నీ, హెచ్‌బీఓ, అమెజాన్ యాపిల్‌లతో పోల్చితే ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ యాప్‌గా నిలిచింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో 15లక్షల మంది కొత్తగా చేరారు. మొత్తంగా వార్షిక ఆదాయంలో 19% వృద్ధితో 47.3 బిలియన్ డాలర్లను ఆర్జించింది. అయితే.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల నెట్‌ఫ్లిక్స్ నికర లాభం.. 2013 ప్రథమార్థం కన్నా చాలా తక్కువగా నమోదవ్వడం గమనార్హం.
ఇవీ చదవండి: