తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

టిక్​టాక్, రీల్స్​కు పోటీగా నెట్​ఫ్లిక్స్​ 'ఫాస్ట్​ లాఫ్స్​'

టిక్​టాక్​కు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​ సరికొత్త ఫీచర్​ను లాంచ్​ చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాలలో ఐఓఎస్​ పరికరాలకే పరిమితమైన ఈ ఫీచర్​ను ఆండ్రాయిడ్​ వెర్షన్​కూ విస్తరించే ప్రక్రియ టెస్టింగ్​ దశలో ఉందని ఆ​ సంస్థ తెలిపింది.

video streaming platform Netfli
టిక్​టాక్​కు ప్రత్యామ్నయంగా నెట్​ఫ్లిక్స్​ 'ఫాస్ట్​ లాఫ్స్​'

By

Published : Mar 5, 2021, 12:55 PM IST

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్​ సంస్ నెట్​ఫ్లిక్స్​.. టిక్​టాక్​కు ప్రత్యామ్నాయంగా 'ఫాస్ట్​ లాఫ్స్​' అనే సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫన్నీ క్లిప్స్​ను మొబైల్​ యూజర్స్​కు ఈ ఫీచర్ అందించనుంది. ప్రస్తుతం పరిమిత దేశాలలో ఐఓఎస్​ పరికరాలకే పరిమితమైన ఈ ఫీచర్​ను ఆండ్రాయిడ్​ వెర్షన్​కూ విస్తరించే ప్రక్రియ టెస్టింగ్​ దశలో ఉందని నెట్​ఫ్లిక్స్​ సంస్థ తెలిపింది.

టిక్​టాక్​కు ప్రత్యామ్నయంగా నెట్​ఫ్లిక్స్​ 'ఫాస్ట్​ లాఫ్స్​'

ప్రముఖ టీవీ షోలు, సనిమాలు, జెర్రీ సీన్ఫెల్డ్, అలీ ఓంగ్​ వంటి స్టాండ్​ అప్ కమెడియన్​ కామెడీ షోస్​ నుంచి షార్ట్​క్లిప్స్​ ఇకనుంచి నెట్​ఫ్లిక్స్​లో ప్లే అవుతాయి. యూజర్స్​ ఆసక్తి మేరకు తర్వాత చూసుకోవడానికి సేవ్​ చేసుకునే క్లిప్స్​కు ప్రత్యేకమైన టైటిల్​ పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ​ఫాస్ట్​లాఫ్స్​ ఫీచర్​లో నేవిగేషన్​ బటన్​ క్లిక్​ చేసి యూజర్స్ ఫన్నీ​ వీడియోలను ఆస్వాదించవచ్చు. ఒక క్లిప్​ అయిపోగానే మరో క్లిప్​ ప్లే అవుతుంది. యూజర్స్​ తమకు కావాల్సిన ఫీడ్​ను వెనువెంటనే చూడడానికి ప్లే లిస్ట్​కు యాడ్​ చేసుకునే ఆవకాశం ఉంటుంది. వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్​, స్నాప్​చాట్​, ట్విట్టర్​లో క్లిప్స్​ను షేర్​ చేసుకునే వీలు ఉంటుంది.

-నెట్​ఫ్లిక్స్ సంస్థ​

ఇదీ చదవండి:రికార్డు స్థాయిలో ఆదాయం 'జూమ్​'

ABOUT THE AUTHOR

...view details