తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

'ఆర్​&డీకి ఊతమిస్తేనే టెలికాం స్వావలంబన' - టెలికాం రంగంపై ట్రాయ్ ఛైర్మన్​ తాజా ప్రకటన

టెలికాం రంగంలో భారత్ స్వావలంబన సాధించేందుకు పరిశోధన, అభివృద్ధి విభాగం (ఆర్​&డీ)పై పెట్టుబడులు పెరగాలని ట్రాయ్​ ఛైర్మన్​ పీడీ వాఘేలా అభిప్రాయపడ్డారు. 15వ డిజిటల్ ఇండియా సదస్సులో మాట్లాడిన ఆయన.. దేశీయ టెలికాం ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు.

Need to increase R&D investment in Telecom
టెలికాం ఆర్​&డీలో పెట్టుబడులు పెరిగాలి

By

Published : Jan 19, 2021, 5:53 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

టెలికాం రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్​&డీ) విభాగానికి పెట్టుబడులు పెరగాలని టెలికాం నియత్రణ సంస్థ 'ట్రాయ్​' ఛైర్మన్​ పీడీ వాఘేలా అన్నారు. దేశీయ, ప్రపంచ టెలికాం అవసరాలు తీర్చేందుకు భారత ఐటీ పరిశ్రమ సామర్థ్యాలను పెంచాల్సిన అవసరముందన్నారు. టెలికాం రంగంలో 'ఆత్మ నిర్భర్ భారత్' సాకారానికి ఇవి తోడ్పడతాయని పేర్కొన్నారు.

15వ డిజిటల్ ఇండియా సదస్సులో ఈ సూచనలు చేశారు వాఘేలా.

మొబైల్, బ్రాడ్​బ్యాండ్​, డిజిటల్ ఆటోమేషన్​లు వృద్ధి చెందుతున్న తరుణంలో.. దేశీయ టెలికాం ఉత్పత్తులను ప్రోత్సహించాలని కూడా సూచించారు వాఘేలా. డేటా వినియోగం పెరుగుతున్న విషయాన్ని ఎత్తి చూపుతూ.. డిజిటల్​ స్వావలంబన సాధించడంలో డేటా సెంటర్లకూ సమాన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

'డిజిటల్ విభాగంలో గత ఆరేడేళ్లుగా భారత్​ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. స్వావలంబన కోసం మనమంతా కలిసి పని చేయాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను దాటుకునేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏకతాటిపైకి రావాలి.' అని వాఘేలా పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:పెరిగిన బంగారం, వెండి ధరలు

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details