తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఆర్టెమిస్-1 ప్రయోగానికి కొత్త ముహూర్తం.. నింగిలోకి దూసుకెళ్లేది అప్పుడే.. - ఆర్టెమిస్ 2 ప్రయోగం

Artemis 1 Mission : అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-1 ప్రయోగానికి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ ప్రయోగాన్ని నవంబరు 14న చేపట్టేందుకు నాసా సిద్ధమైంది.

Artemis 1 mission
ఆర్టెమిస్ 1 ప్రయోగం

By

Published : Oct 13, 2022, 8:23 PM IST

Artemis 1 Mission : నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఆర్టెమిస్-1' ప్రయోగానికి ముచ్చటగా మూడోసారి షెడ్యూల్‌ ఖరారైంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా.. తాజాగా నవంబరు 14న ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇటీవల ఫ్లోరిడాలో హరికేన్‌ సంభవించడం వల్ల రాకెట్​ను లాంచ్ ప్యాడ్‌ నుంచి హాంగర్‌కు తరలించి.. తనిఖీలు పూర్తిచేసి కొత్త తేదీని ఖరారు చేసినట్లు నాసా వెల్లడించింది. ఆ రోజు వీలు కాకపోతే నవంబరు 16 లేదా 19న ప్రయోగం చేపట్టనున్నారు.

ఆగస్టు 29న ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. ఇంధన లీకేజీ సమస్యతో నిలిచిపోయింది. అనంతరం సెప్టెంబరు 3న మరోసారి షెడ్యూల్ చేయగా.. మరోసారి ఇంధన లీకేజీ తలెత్తింది. చంద్రుడిపై శాశ్వత నివాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రయోగం చేపడుతుండగా.. ప్రస్తుతం మాత్రం అందులో ఉన్న ఓరియన్‌ క్యాప్సూల్‌ మానవరహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రానుంది. 2024లో ఆర్టెమిస్‌-2, 2025లో ఆర్టెమిస్‌-3 ప్రయోగాలను నాసా చేపట్టనుంది.

ABOUT THE AUTHOR

...view details