Twitter Ad Revenue Sharing : ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ బంపర్ బొనాంజా ప్రకటించారు. యూజర్లు తమ ట్విట్టర్ అకౌంట్లు వెరిఫికేషన్ చేసుకొని, వేలాది డాలర్లు సంపాదించుకోవచ్చని మస్క్ ప్రకటించారు. ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూలో వెరిఫైడ్ సబ్స్క్రైబర్లకు కూడా కొంత మేరకు అందిస్తామని మస్క్ స్పష్టం చేశారు.
కండిషన్స్ అప్లై అవుతాయ్?
Twitter verification requirements : వాస్తవానికి ఒక యూజర్ ట్విట్టర్ అకౌంట్కు 10,000 ఫాలోవర్స్ ఉండి, నెలకు 5 మిలియన్ల ఇంప్రెషన్స్ ఉంటేనే ట్విట్టర్ వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. కానీ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే మస్క్ యూజర్లు అందరూ ట్విట్టర్ బ్లూ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని సూచించారు.
"ట్విట్టర్ వేదికగా వెరిఫైడ్ సబ్స్క్రైబర్స్ యాడ్ రెవెన్యూలో భాగస్వామ్యం పొందవచ్చు. ఈ విధంగా నెలవారీగా వేలాది డాలర్లు సంపాదించవచ్చు. "
- ఎలాన్ మస్క్, ట్విట్టర్ అధినేత
నెలకు 7 డాలర్లు మాత్రమే!
Twitter blue tick price : ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్కు బ్లూ టిక్ పొందాలంటే, నెలకు 7 డాలర్లు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇది యాన్యువల్ ప్లాన్ తీసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది.