మొబైల్ ఇండస్ట్రీలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రాక పెను విప్లవం అనే చెప్పాలి. దీని వల్ల స్మార్ట్ ఫోన్స్ వినియోగం బాగా పెరిగింది. వందల కొద్దీ యాప్స్ ప్లే స్టోర్ లోకి వచ్చేయడం, ఓపెన్ ప్లాట్ ఫామ్‌లో డౌన్లోడ్ చేసుకునేందుకు ఆండ్రాయిడ్‌తో అవకాశం లభించింది. అదే ఐఫోన్లలో వాడే ఐఓఎస్‌లో అయితే కొద్ది యాప్స్ మాత్రమే డౌన్ లోడ్ చేసుకుని వాడుకునే అవకాశం ఉండేది. అందులోనూ కొన్ని యాప్స్ ఇన్‌స్టాలేషన్‌కు డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి. దీంతో ధరలో, వాడకంలో సులువుగా ఉండే ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్ల వైపు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్లదే రాజ్యం అని చెప్పొచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్ల విషయానికొస్తే.. అందులో ఒక్కో పనికి నిర్దేశించి ఒక్కో యాప్ ఉంది. కొన్ని మల్టీపర్పస్ యాప్స్ కూడా ఉన్నాయి. అయితే ఒకే యాప్‌తో విభిన్న పనులను చేసుకునే సౌకర్యం కల్పించే యాప్స్ సంఖ్య తక్కువనే చెప్పాలి. మల్టీపర్సప్ యాప్స్‌ను చాలా మంది థర్డ్ పార్టీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే.. ప్లే స్టోర్‌లోనూ కొన్ని మల్టీపర్పస్ యాప్స్ ఉన్నాయి. అలాంటి ఒక ఆండ్రాయిడ్ యాప్ 'టూలీ'. ఇందులో 100 వరకు ఉపయోగకరమైన టూల్స్ ఉన్నాయి. దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అసలు ఈ టూలీ యాప్ ఏంటి, దీంట్లో ఉన్న ఫీఛర్లకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
టూలీ యాప్‌లో ఎన్నో ఉపయోగపడే టూల్స్ ఉన్నాయి. ఇమేజ్ రీసైజింగ్ మొదలుకుని ఇమేజ్ క్రాపింగ్, కన్వర్టింగ్ టెక్ట్స్ కేసెస్, సార్టింగ్ లైన్స్, కన్వర్టింగ్ యూనిట్స్ వరకు రోజువారీగా ఉపయోగపడే ఎన్నో టూల్స్ ఇందులో ఉన్నాయి. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి యాడ్స్ కూడా రావు. ఆఫ్‌లైన్‌లోనే దీన్ని వాడుకోవచ్చు.
ఎన్నో టూల్స్..
టూలీ యాప్‌లో 7 కేటగిరీల టూల్స్ ఉన్నాయి. టెక్ట్స్, ఇమేజ్, క్యాల్కులేషన్, యూనిట్, డెవపల్ మెంట్, కలర్, రాండమైజర్ విభాగాల్లో విభిన్నమైన టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం..