తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Motorola Moto G14 Launch : అదిరిపోయే ఫీచర్స్​తో మోటోరోలా ఫోన్​ లాంఛ్​​.. ధర ఎంతంటే? - మోటోరోలా మోటో జీ14

Motorola Moto G14 Launch Today In India : ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా మరో కొత్త మోడల్​తో వినియోగదారుల ముందుకు వచ్చింది. మోటో జీ14 పేరుతో దీనిని ఇండియన్​ మార్కెట్​లోకి లాంఛ్​ చేసింది. మరి దీని ధర ఎంత, ఫీచర్స్​ సంగతేంటి తదితర వివరాలు మీ కోసం.

Motorola Moto G14 Launch Today In India Price Features Full Details Here In Telugu
అదిరిపోయే ఫీచర్స్​తో మోటోరోలా మోటో జీ14 మొబైల్​.. ధర ఎంతంటే..

By

Published : Aug 1, 2023, 5:20 PM IST

Updated : Aug 1, 2023, 6:59 PM IST

Motorola Moto G14 Launch Today : మొబైల్స్​ తయారీ రంగంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా.. మరో సరికొత్త ప్రొడక్ట్​ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. మోటో జీ14 పేరుతో అదిరిపోయే ఫీచర్స్​తో కొత్త మోడల్ ఫోన్​​ను మంగళవారం ఇండియాలో లాంఛ్​ చేసింది. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​గా పేర్కొంటున్న దీనిని రూ.15,000 వేలలోపే అందించనున్నట్లుగా తెలిపింది. మోటోరోలా ఆఫ్​లైన్​, ఆన్​లైన్ స్టోర్​లతో పాటు ఫ్లిప్​కార్ట్ పోర్టల్​లోనూ మోటో జీ14ను కొనుగోలు చేయొచ్చు. మరోవైపు షావోమీ అనుబంధ సంస్థ రెడ్​మీ కూడా మోటో జీ14కు పోటీగా రెడ్​మీ 12 పేరుతో 5జీ సపోర్ట్​ మోడల్​ ఫోన్​ను ఆగస్టు 1నే లాంఛ్​ చేసింది.

మోటోరోలా మోటో జీ14

ఫీచర్స్​ ఇవే..
Motorola Moto G14 Features : మోటో జీ13కు అప్డేటెడ్​ వెర్షన్​గా వచ్చిన మోటో జీ14లో డ్యూయెల్​ రియర్​​ కెమెరాతో పాటు 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే, డాల్బీ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. 4జీబీ ర్యామ్​, 128 జీబీ ఇంటర్నల్​ స్టోరేజీ సామర్థ్యంతో పాటు మరికొన్ని ఔరా అనిపించే ఫీచర్స్​ ఈ ఫోన్​ సొంతం. బ్లాక్​, బ్లూ కలర్స్​లో ఈ ఫోన్​ను అందుబాటులోకి తెచ్చారు. ఇక హోల్​ పంచ్​ కటౌట్​తో కూడిన సెల్ఫీ కెమెరాను ఇందులో అమర్చారు. ఫోన్​కు కుడి భాగంలో వాల్యూమ్​ ఇంకా పవర్​ బటన్​లను గమనించవచ్చు. బ్యాక్​​ కెమెరాల నుంచి తీసే ఫొటోలు అద్భుతంగా రావడానికి ట్రాన్స్​పరెంట్​ రెక్టాంగ్యులర్​​ డెక్​ మాదిరిగా ఉండే 50 మెగాపిక్సల్​ కెమెరాలనూ ఇందులో ఏర్పాటు చేశారు. దీనితో పాటు మ్యాక్రో కెమెరా కూడా ఉంది. ఆండ్రాయిడ్​ 13 సాఫ్ట్​వేర్​ ఆధారంగా ఇది పనిచేస్తుంది.

Motorola Moto G14 Features : యూనిసొక్​ టీ616 ఎస్ఓసీ ప్రాసెసర్​ను మోటో జీ14లో వాడారు. అలాగే మూడేళ్ల భద్రతాపరమైన అప్​డేట్లను కూడా ఈ ఇది స్వీకరిస్తుంది. 20 వాట్స్​ ఛార్జింగ్​ కెపాసిటీ, 5000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్​లో చెప్పుకోదగ్గ అంశాలు. ఒక్కసారి ఛార్జింగ్​ చేస్తే 94 గంటలపాటు నిర్విరామంగా పాటలను వినడమే కాకుండా 34 గంటల వరకు ఫోన్​ను కూడా మాట్లాడుకోవచ్చు. అంటే ఒక్కసారి ఛార్జింగ్​తో దాదాపుగా 5 రోజుల బ్యాక్​అప్​ను ఆస్వాదించవచ్చు. కాగా, ఇది వ్యక్తి యూసేజ్​పై కూడా ఆధారపడి ఉంటుంది.

మోటో జీ14 స్పెక్స్ అండ్​ ఫీచర్స్​..

  • కలర్స్​- బ్లూ, బ్లాక్​
  • ఓఎస్​- ఆండ్రాయిడ్​ 13
  • స్పీకర్లు- డాల్బీ స్టీరియో
  • మూడేళ్ల భద్రతాపరమైన అప్​డేట్లు
  • ప్రాసెసర్‌​- యూనిసొక్​ టీ616 ఎస్ఓసీ
  • బ్యాటరీ సామర్థ్యం- 5000 ఎంఏహెచ్​
  • డిస్​ప్లే- 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే
  • డ్యుయెల్​ రియర్​​ కెమెరా- 50 మెగాపిక్సల్+మ్యాక్రో కెమెరా
  • స్టోరేజీ- 4జీబీ ర్యామ్​, 128 జీబీ ఇంటర్నల్​ స్టోరేజీ మెమోరీ
  • అదనపు ఫీచర్లు- 34 గంటల టాక్​టైమ్, 94 గంటల మ్యూజిక్​ ప్లేబ్యాక్​
  • ధర- రూ.15 వేల లోపే. వినియోగదారుడు ఎంచుకునే ఫీచర్ల ఆధారంగా ధర ఉంటుంది.

Motorola Moto G14 Price : ఇక ఫింగర్​ప్రింట్​ స్కానర్​, డ్యూయెల్​ సిమ్​ కార్డ్​ స్లాట్​ మోటో జీ14లోని ఎక్స్​ట్రా ఫీచర్స్​. ఇక మోడల్​ స్పెక్స్​ ఆధారంగా దీని ధరలో మార్పులు ఉండవచ్చు. ప్రస్తుతానికి భారత్​లో దీని ధర రూ.15,000లోపే ఉంటుందని అంచనా. కాగా, మోటో జీ14 అమ్మకాలు మోటోరోలా నుంచి రానున్న అత్యంత ప్రీమియం ఫోన్లలో ఒకటిగా చెప్పుకుంటున్న మోటోరోలా ఆర్​ఏజెడ్​ఆర్​ 40 అల్ట్రా ఫ్లిప్​ ఫోన్​ విడుదలయిన కొద్ది రోజులకే ప్రారంభం కానున్నాయి. మొత్తంగా ఆండ్రాయిడ్​కు అతిపెద్ద అప్​డేట్​గా మోటో జీ14 మోడల్​ లాంఛ్​ను టెకీలు అభివర్ణిస్తున్నారు.

రెడ్​మీ 12 ఫీచర్స్​..
Redmi 12 Features And Price : రెడ్​మీ సంస్థ కూడా మోటో జీ14కు ధీటుగా రెడ్​మీ 12ను లాంఛ్​ చేసింది. మోటో జీ14, రెడ్​మీ 12 ఫ్రేమ్​ డిజైన్​ దాదాపు ఒకేలా ఉన్నాయి. 5జీ ఎస్​ఓసీ చిప్​సెట్​, ట్రిపుల్​​ రియర్​​ కెమెరా, 5000 ఏమ్​ఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ రెడ్​మీ 12లోని ప్రత్యేకతలు. దీని ధర రూ.15,000-రూ.20,000లోపే ఉంటుందని మార్కెట్​ వర్గాల అంచనా.

రెడ్​మీ 12 స్పెక్స్ అండ్​ ఫీచర్స్​..

  • 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్​
  • మోడల్​- రెడ్​మీ 12
  • కార్నింగ్​ గొరిల్లా గ్లాస్
  • డిజైన్​- క్రిస్టల్​ గ్లాస్​ డిజైన్
  • బరువు- 200 గ్రాముల్లోపే
  • ఛార్జింగ్​ స్పీడ్​- 18 వాట్స్
  • MIUI డైలర్​+MIUI 14
  • సెల్ఫీ కెమెరా- 8 మెగాపిక్సల్​
  • ఐపీ53 రేటింగ్​ స్ప్లాష్​ ప్రొటెక్షన్​
  • 3.5 ఎమ్​ఎమ్​ హెడ్​ఫోన్ జ్యాక్​
  • బ్యాటరీ కెపాసిటీ- 5000 ఎంఏహెచ్​
  • ప్రాసెసర్‌- హిలియో జీ88 ఆక్టా-కోర్​ ప్రాసెసర్‌
  • రియర్​ కెమెరా- 50 మెగాపిక్సల్​ ట్రిపుల్​ కెమెరా
  • స్టోరేజీ- 8జీబీ ర్యామ్​, 256 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​
  • ధర- రూ15,000-రూ.20,000(ఫీచర్ల ఆధారంగా)
  • డిస్​ప్లే- 6.79 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే(17.2 సె.మీ)
  • ఆగస్టు 4నుంచి ఆన్​లైన్ అండ్​ ఆఫ్​లైన్​ స్టోర్స్​లో కొనుగోలు చేయొచ్చు.
Last Updated : Aug 1, 2023, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details