Motorola Flexible Phone : ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో అన్ని బ్రాండెడ్ మొబైల్ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా.. సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది. ఫుల్ ఫ్లెక్సిబుల్ ఫోన్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. అందులో ఫోన్ చేతికి వాచ్‌లా చుట్టుకున్నట్లు చూపించింది.
Motorola Flexible Smart Phone Concept :గత వారం జరిగిన లెనోవా టెక్ వరల్డ్‌లో మోటోరోలా.. ఫుల్ ఫ్లెక్సిబుల్ ఫోన్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. 6.9 అంగుళాల ఎల్ఈడీ స్కీన్ ఉన్న ఫోన్‌ను అన్నింటిలా సాధారణంగా వాడొచ్చని చూపించింది. ముందు వైపే కాకుండా వెనుకకు కూడా మడవవచ్చని తెలిపింది. టేబుల్‌పై స్టాండ్‌లా మడిచి ఫోన్ వాడుకోవచ్చని పేర్కొంది. పెద్ద సైజు స్మార్ట్ వాచ్‌ల చేతికి పెట్టుకోవచ్చని కూడా చెప్పింది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి మిగతా ఫీచర్లు, బ్యాటరీ కెపాసిటీ కోసం మోటోరోలా వెల్లడించలేదు.