Most Useful Telegram Bots: ప్రపంచంలో అత్యంత ఆదరణ గల యాప్స్‌లో టెలిగ్రామ్ ఒకటి. ఈ దిగ్గజ మెసెంజర్‌కు 100 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఇందులో ఉండే ప్రత్యేక ఫీచర్లు మరే ఇతర యాప్‌లోనూ అందుబాటు ఉండవు. ముఖ్యంగా బాట్స్ ద్వారా యూజర్లకు ఆకర్షణీయమైన సేవలు అందిస్తోంది టెలిగ్రామ్. వాటి గురించి తెలిస్తే మీరు కూడా వెంటనే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోని ఓసారి ట్రై చేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
AI Background remover bot: ఈ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ బాట్ ద్వారా మన ఫొటోలోని బ్యాక్‌గ్రౌండ్‌ను క్షణాల్లో తొలగించవచ్చు. దీనికోసం ఇతర యాప్‌లను ప్రత్యేకంగా ఉపయోగించనక్కర్లేదు. ఈ బాట్ చాట్‌లో మనం బ్యాక్‌గ్రౌండ్‌ను తొలిగించాలనుకుంటున్న ఫొటోను అప్లోడ్ చేస్తే చాలు.. వెంటనే అది బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగించి హై రిజొల్యుషన్ ఫొటోగా మార్చి మనకు అందిస్తుంది. ఆ తర్వాత మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Dropmail.me: ఈ బాట్ ద్వారా అద్భుతమైన ఫీచర్‌ను అందిస్తోంది టెలిగ్రామ్. మనం సాధారణంగా సోషల్ మీడియా ఖాతాను ఓపెన్ చేయాలన్నా, యాప్స్‌లోకి లాగిన్ కావాలన్నా ఈమెయిల్ ఐడీని అడుగుతాయి. ఒక్కోసారి మెయిల్ ద్వారానే ఓటీపీ వెరిఫికేషన్ కూడా జరుగుతుంటుంది. అలాంటి సమయంలో మన వ్యక్తిగత ఈమెయిల్ ఐడీని తెలియజేయవద్దనుకున్నప్పుడు.. మనకోసం ఓ ఫేక్ మెయిల్ ఐడీని క్రియేట్ చేస్తుంది టెలిగ్రామ్‌లోని Dropmail.me బాట్. ఓటీపీ వెరిఫికేషన్ కూడా దీని ద్వారా చేసుకోవచ్చు. టెలిగ్రామ్లోనే ఈ మెయిల్ ఐడీని సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.