తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

WhatsApp Scams : వాట్సాప్​ స్కామ్స్​ పెరిగిపోతున్నాయ్!​.. జాగ్రత్తపడండి ఇలా! - వాట్సాప్​ లాటరీ స్కామ్స్​

WhatsApp Scams 2023 : ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉంటే.. అంతకంటే ఎక్కువగా ఆన్​లైన్​ స్కామ్స్​ పెరిగిపోతున్నాయి. యూజర్​ బేస్ ఎక్కువగా ఉన్న యాప్​లను లక్ష్యంగా చేసుకుని సైబర్​ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. మరి ఈ ఆన్​లైన్​ మోసాలు, స్కామ్స్​ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందామా?

online scams
Most Common WhatsApp Scams And How To Avoid Them

By

Published : Jul 8, 2023, 12:21 PM IST

WhatsApp Scams and Online Scams : వాట్సాప్​ నేడు మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ముఖ్యమైన సమాచారాన్ని చిటికెలో అందించడానికి, తెలుసుకోవడానికి ఇది గొప్ప వేదిక అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఇదే ఇప్పుడు స్కామ్​లకు, మోసపూరిత కార్యక్రమాలకు అడ్డాగా మారింది.

భారతదేశంలో వాట్సాప్​కు అతిపెద్ద యూజర్​ బేస్​ ఉంది. అందుకే ఆన్​లైన్​ మోసగాళ్లు, సైబర్​ నేరగాళ్లు దీనిపై కన్నేశారు. వీరు చేసే స్కామ్​లు చాలా రూపాల్లో ఉంటాయి. ముఖ్యంగా వీరి వలలో చిక్కుకున్నవారిని ఆర్థికంగా దోపిడీ చేస్తారు. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. మరీ ఘోరంగా బాధితుల ఐడెంటీని కూడా తస్కరిస్తారు.

నమ్మించి.. మోసం చేస్తారు!
WhatsApp scam messages : స్కామర్లు మంచి పేరున్న సంస్థలు, వ్యక్తుల పేర్లతో స్కామ్​లకు పాల్పడుతుంటారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామని లేదా సులువైన మార్గాల్లో బాగా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపిస్తారు. కొన్ని సార్లు ఆకర్షణీయమైన ఆఫర్లు, బహుమతుల పేరిట వల విసురుతారు. పొరపాటున వీటి ట్రాప్​లో పడ్డామా.. ఇక అంతే! మన జేబుకు చిల్లుపడినట్లే. వాస్తవానికి ఈ నేరగాళ్లు ఎంతగా తెలివిమీరిపోయారంటే.. వీరి నుంచి వచ్చే మెసేజ్​లు నిజమైనవా? లేదా నకిలీవా? అని కనిపెట్టడం కూడా చాలా కష్టం.

2023లో జరిగిన వాట్సాప్​ స్కామ్​లు

వీడియో కాల్​ స్కామ్​ :
WhatsApp Video Call Scams : స్కామర్లు అందమైన అమ్మాయిలు లేదా అబ్బాయిల ప్రొఫైల్​ పిక్చర్స్​తో.. తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులకు వీడియో కాల్​ చేస్తారు. పొరపాటున వాటిని లిఫ్ట్ చేస్తే, మంచిగా మాటల్లోకి దింపి, మిమ్మల్ని ఆకర్షించే విధంగా న్యూడ్​ ఫోటోలు, వీడియోలు పంపిస్తారు. కొన్ని సార్లు న్యూడ్​ కాల్స్ చేసేందుకు ప్రోత్సహిస్తారు. అమాయకంగా వారి వలలో పడిన వెంటనే.. దానిని జాగ్రత్తగా రికార్డ్ చేస్తారు. ఇక అప్పటి నుంచి డబ్బులు డిమాండ్​ చేస్తూ, బెదిరిస్తారు. ఇవ్వనంటే, ఆ వీడియోలను బంధువులకు, స్నేహితులకు చూపిస్తామని హెచ్చరిస్తారు. మీరు భయపడి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిన తరువాత, ఇక ప్రతిసారీ మిమ్మల్ని ఆర్థికంగా పీడిస్తూనే ఉంటారు. కనుక ఇలాంటి కాల్స్​ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

లాటరీ స్కామ్స్​ :
Lottery Scams in India : సైబర్​ నేరగాళ్లు లాటరీ ప్రైజ్ ​మనీ​ పేరుతో ఫ్రాడ్స్​ చేస్తుంటారు. ముఖ్యంగా లాటరీలో భారీ మొత్తం సొమ్మును గెలుచుకున్నారంటూ.. వ్యక్తులకు ఈ-మెయిల్స్​, ఫొటోస్​ లేదా వీడియోస్​ పంపిస్తారు. ఎవరైనా పొరపాటున వీటిని నమ్మితే.. ఒక ప్రత్యేకమైన ఫోన్ నంబర్ ఇస్తారు. ఆ నంబర్​కు కాల్​ చేసి లాటరీ డబ్బులు గురించి మాట్లాడమని నమ్మకంగా చెబుతారు. ఆ నంబర్​కు ఫోన్​ చేస్తే, గెలిచిన డబ్బు పంపించడానికిగాను కొంత సొమ్మను సెక్యూరిటీగా కట్టవలసి ఉంటుందని, అయితే దానిని కూడా రిఫండ్​ చేస్తామని నమ్మిస్తారు. ఇది మోసమని తెలియక చాలా మంది ఇలా డబ్బులు పంపించి, భారీగా నష్టపోతున్నారు. ఈ విషయంలో తస్మాత్త్​ జాగ్రత్త.

క్రిప్టో స్కామ్స్​
Crypto Scams : సైబర్​ క్రిమినల్స్​ ప్రధానంగా విద్యావంతులను క్రిప్టో స్కామ్స్​కు బలిచేస్తున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే, చాలా పెద్ద మొత్తంలో సంపాందించవచ్చని నమ్మిస్తారు. దీనిని నమ్మి డిజిటల్​, క్రిప్టో కరెన్సీలలో ఇన్​వెస్ట్​ చేస్తే, మోసపోవడం ఖాయం.

వాట్సాప్​ క్యూఆర్​ కోడ్​
QR Code Scams 2023 : సైబర్ నేరగాళ్లు.. వ్యక్తులకు క్యాష్​ ప్రైజ్​ వచ్చిందని నమ్మిస్తూ, క్యూఆర్​ కోడ్​లను పంపిస్తారు. పొరపాటున ఈ క్యూఆర్​ కోడ్​లను స్కాన్ చేశారో.. మీ బ్యాంకు అకౌంట్​ మొత్తం ఖాళీ అవుతుంది.

స్కామ్స్​ నుంచి ఎలా తప్పించుకోవాలి?
How to Protect from online scams : ఆన్​లైన్​ స్కామ్స్​, వాట్సాప్​ స్కామ్స్​ నుంచి తప్పించుకోవాలంటే కొన్ని కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు తెలియని నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్​లను, ఈ-మెయిల్​లను, వాటి అటాచ్​మెంట్లను క్లిక్​ చేయకపోవడం మంచిది. తెలియని వ్యక్తులు.. మన వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. అర్జెంట్​గా డబ్బులు కావాలి అంటూ ప్రాధేయపడుతూ వచ్చే మెసేజ్​లను ఇగ్నోర్​ చేయడం ఉత్తమం.

ఒక వేళ మీకు వచ్చిన మెసేజ్​ లేదా ఈ మెయిల్​లో ఇంగ్లీష్ పదాలు, గ్రామర్ తప్పుగా ఉండే.. కచ్చితంగా అది స్కామర్స్​ పనే అని గుర్తించాలి. మీరు ఎప్పుడూ పార్టిసిపేట్​ చేయని లాటరీలో.. మీకు బహుమతి వచ్చిందని మెసేజ్​ వస్తే.. దానిని కచ్చితంగా స్కామ్​గా గుర్తించండి. ఒక వేళ మీరు కచ్చితంగా డబ్బులు పంపించాల్సి వస్తే.. అవతలి వ్యక్తి పూర్తి సమాచారాన్ని వెరిఫై చేసుకొని మాత్రమే ఆన్​లైన్ మనీ ట్రాన్స్​ఫర్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details