Most Common Passwords 2023 :కంప్యూటర్, మొబైల్, ఇ-మెయిల్, యాప్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్.. ఇలా అన్నిటికీ పాస్వర్డ్స్ ఉంటాయి. కానీ, ఈ మధ్య కాలంలో హ్యాకింగ్ బెడద పెరిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని టెక్ కంపెనీలు సూచిస్తూనే ఉన్నాయి. అయినా.. యూజర్లలో పెద్దగా మార్పు లేదని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది.. ఈజీగా కనిపెట్టగలిగే పాస్వర్డ్స్(Passwords)నే పెట్టుకుంటున్నారట! మన ఇండియాలో కూడా అత్యధిక మంది సింపుల్ కామన్ పాస్‌వర్డ్స్‌నే యూజ్ చేస్తున్నారట! ఇందులో.. ఎక్కువగా వాడుతున్న కామన్ పాస్వర్డ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Most Common Passwords 2023 in The World :ఇప్పటికీ.. ఎక్కువ మంది వినియోగిస్తున్న మోస్ట్ కామన్ పాస్‌వర్డ్ '123456' అని నార్డ్ పాస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైందట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 లక్షల అకౌంట్లకు ‘‘123456’’ అనే పాస్‌వర్డ్ (Password) ఉన్నట్లు ఈ రీసెర్చ్ తెలిపింది. ఇలాంటి పాస్ట్‌వర్డ్‌లను క్రాక్ చేయడానికి.. సైబర్ నేరస్తులకు సెకన్ సమయం కూడా ఎక్కువేనని వెల్లడించింది. ఇక అత్యధిక మంది వాడుతున్న పాస్‌వర్డ్ జాబితాలో ‘‘admin’’ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. దాదాపు 40 లక్షల ఖాతాలను దీనితో యాక్సెస్ చేయొచ్చని తెలియజేసింది. అలాగే అత్యధిక మంది ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌లలో మూడో స్థానంలో ‘‘12345678’’ అనేది ఉందని వెల్లడించింది. దాదాపు 13.7 లక్షల ఖాతాలకు యూజర్లు దీన్ని పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకున్నారని నార్డ్‌పాస్ తెలిపింది.
ఇండియన్స్ వినియోగిస్తున్న మోస్ట్ కామన్ పాస్‌వర్డ్..భారత్‌లో ఎక్కువ మంది వినియోగిస్తున్న పాస్‌వర్డ్ ‘‘123456’’ అని నార్డ్‌పాస్ సాఫ్ట్వేర్ కంపెనీ వెల్లడించింది. దాదాపు 3.6 లక్షల అకౌంట్లకు ఈ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకున్నారని తెలిపింది. ఆ తర్వాత రెండోస్థానంలో 1.2 లక్షల ఖాతాలకు ‘‘admin’’ అనే పాస్‌వర్డ్‌ను సెట్ చేసినట్లు వెల్లడించింది. పరిశోధన బృందాలు 6.6 టెరాబైట్ల డేటాబేస్‌ను స్టీలర్ మాల్వేర్ల సాయంతో యాక్సెస్ చేసుకొని ఈ సమాచారాన్ని పొందుపర్చినట్లు నార్డ్‌పాస్ పేర్కొంది. కేవలం స్టాటిస్టికల్ సమాచారం మాత్రమే తమకు అందిందని.. యూజర్ల వ్యక్తిగత వివరాలేవీ పరిశోధకుల బృందం తమకు ఇవ్వలేదని వెల్లడించింది.