తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

బెస్ట్​ కెమెరాతో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే! - ఇన్ఫినిక్స్ నోట్​ 10 ప్రో..

ప్రస్తుతం కుర్రకారు మంచి కెమెరా ఉండే ఫోన్ల కోసం చూస్తున్నారు. చాలా కంపెనీలు కూడా అందుకు తగ్గట్టుగా మొబైల్స్​ను మార్కెట్​లోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్​లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్​ కెమెరా ఫోన్లు ఏవో ఓ లుక్కేద్దాం.

Mobiles Under Rs 20000, Redmi Note 10 Pro
బెస్ట్​ కెమెరా స్మార్ట్​ఫోన్లు

By

Published : Jul 21, 2021, 7:16 PM IST

మొబైల్​ఫోన్​ల మార్కెట్​లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే కంపెనీలు కూడా యూజర్లను ఆకట్టుకునేందుకు వీలైనన్ని ఎక్కువ ఫీచర్లను అందిస్తున్నాయి. వాటిలో ముందుండేది కెమెరా. ప్రస్తుతం వస్తోన్న ఫోన్లు ఎక్కువ భాగం వీడియోలకు, ఫోటోలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వాటితో 4కే వీడియోలను కూడా సులభంగా తీసేస్తున్నారు. అందులోనూ వీటి ధర రూ.20వేల లోపే ఉండడం వల్ల అలాంటి ఫొన్ల కొనుగోలుకు కుర్రకారు మరింత మొగ్గు చూపుతున్నారు. దీంతో వీటికి ఎక్కువ డిమాండ్​ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్​లో అందుబాటులో ఉన్న బెస్ట్​ కెమెరాతో కూడిన మొబైల్​ఫోన్లను ఓసారి చూద్దాం.

షియోమీ రెడ్​మీ నోట్​ 10 ప్రో మ్యాక్స్​

షియోమీ నుంచి వచ్చిన రెడ్​మీ నోట్​ 10 ప్రో మ్యాక్స్​ కెమెరా సెగ్మెంట్​లో దూసుకుపోతోంది. 108 మెగాపిక్సల్​తో మెయిన్​ సెన్సార్​ను కలిగిన ఏకైక ఫోన్​ ఇదే కావడం విశేషం. ఇప్పటికే మార్కెట్​లో చాలా ఫొన్లు ఉన్నా.. యువత మాత్రం కెమెరా విషయంలో దీనికే ఓటు వేస్తున్నారు. కలర్ అక్యురెసీ, టోనల్​ అక్యురెసీ, పోట్రేట్​ మోడ్​, నైట్​ మోడ్​లు అనేవి యూజర్​ను ఆకట్టుకునేలా దీనిలో ఉన్నాయి. 5ఎంపీ మ్యాక్రో కెమెరా ఉంది. 8ఎంపీ అల్ట్రా వైడ్​ లెన్స్​తో పాటు 2ఎంపీ డెప్త్​ కెమెరా ఇందులో ప్రధానాకర్షణ. ధర కూడా 20 వేలలోపు ఉండటం వల్ల యూజర్లు దీనివైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

షియోమీ రెడ్​మీ నోట్​ 10 ప్రో మ్యాక్స్​

రియల్​మీ నార్జ్ 30 ప్రో..

20 వేలలోపు మొబైల్స్​లో అత్యున్నత కెమెరా సెగ్మెంట్​లో చెప్పుకోదగ్గ మరో ఫోన్​ రియల్​మీ నార్జ్ 30 ప్రో. దీనికి ఉన్న ట్రిపుల్​ రేర్​ కెమెరా ప్రధానాకర్షణగా నిలుస్తోంది. 48ఎంపీ మెయిన్​ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్​ కెమెరా, 2ఎంపీ మైక్రో కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఇవి ప్రధానంగా డే లైట్​లో అత్యంత మన్నికైన పిక్చర్​ క్వాలిటీని ఇస్తున్నాయి. సాధారణంగా తీసే ఫొటోలు ఏఐ మోడ్​తో మరింత ఆకర్షణీయంగా వస్తున్నాయి. లైట్​ తక్కువ ఉన్నా ఇందులో అద్భుతమైన ఫొటోలు తీయవచ్చు.

రియల్​మీ

ఇన్ఫినిక్స్ నోట్​ 10 ప్రో..

బెస్ట్​ కెమెరా క్వాలిటీతో రూ.20 వేల లోపు ఉండే మరో ఫోన్​ ఇన్ఫినిక్స్​ నోట్​ 10 ప్రో. ఇందులో నాలుగు కెమెరాలు ఉండడం ప్రధానాకర్షణగా నిలుస్తోంది. దీనిలో మొయిన్​ కెమెరా 64ఎంపీ, అల్ట్రా వైడ్​ కెమెరా 8ఎంపీ, మరో రెండు 2ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ఇవి పోట్రేట్​ మోడ్​లో అధ్బుతమైన ఫోటోలను అందిస్తున్నాయి.

ఇన్ఫినిక్స్ నోట్​ 10 ప్రో..

ఐక్యూ జెడ్​3

పర్ఫామెన్స్​ పరంగా ఐక్యూ జెడ్​3 ఫోన్​ రూ.20 వేలలోపు కొనుగోలు చేయాలి అనేవారికి ప్రధాన ఎంపికగా నిలుస్తుంది. దీనితో పాటు అత్యుత్తమ కెమెరా క్వాలిటీ దీని సొంతం. దీనిలో 64 ఎంపీ మెయిన్​ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్​ కెమెరా, 2ఎంపీ మైక్రో కెమెరాలు ఉన్నాయి. ఇవి కలర్​ అక్యురసీ, సాచురేషన్​ లెవల్స్​ను కచ్చితంగా ఉంచి.. హైక్వాలిటీ పిక్చర్​ను అందించేందుకు దోహదపడుతున్నాయి.

ఐక్యూ జెడ్​3

పోకో ఎక్స్​ 3 ప్రో..

బెస్ట్​ కెమెరా సెగ్మెంట్​లో పోకో ఎక్స్​ 3 ప్రో తనదైన ముద్ర వేస్తోంది. దీని ధర కూడా రూ.20 వేల లోపే ఉండడం విశేషం. ఇందులో ప్రధానంగా నాలుగు కెమెరాలు ఉంటాయి. 48ఎంపీ మెయిన్​ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్​, 2 ఎంపీ మాక్రో, 2ఎంపీ డెప్త్​ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాతో పోట్రేట్​ మోడ్​లో పిక్చర్స్ మంచి క్వాలిటీతో రికార్డు అవుతున్నాయి. ఫొటోలు తీసే సమయంలో వచ్చే బ్లర్​ ఇమేజస్​ను కూడా ఇది సర్దుబాటు చేసి మంచి క్వాలిటీని అందిస్తుంది.

పోకో ఎక్స్​3 ప్రో

ఇదీ చూడండి:భారత్​లో టిక్​టాక్ రీఎంట్రీ.. చిన్న మార్పుతో!

ABOUT THE AUTHOR

...view details