తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మైక్రోసాఫ్ట్​ టీమ్స్​లో ఆసక్తికర ఫీచర్​.. వీడియో కాల్​ మాట్లాడుతుండగానే.. - మైక్రోసాఫ్ట్​ టీమ్స్​ అప్​డేట్స్​

Microsoft Teams Features: మైక్రోసాఫ్ట్​ టీమ్స్​ యూజర్స్​ నుంచి ఆసక్తికర ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్​తో యూజర్స్‌ వీడియో కాల్ మాట్లాడేప్పుడు స్క్రీన్‌పై తమ వీడియో ఇతరులకు కనిపించకుండా చేయొచ్చు.

microsoft teams
మైక్రోసాఫ్ట్

By

Published : Jan 12, 2022, 12:51 PM IST

Microsoft Teams Features: మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ యూజర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన ఫీచర్‌ను యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. 'హైడ్‌ యువర్ ఓన్‌ వీడియో' పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్స్‌ వీడియో కాల్ మాట్లాడేప్పుడు స్క్రీన్‌పై తమ వీడియో ఇతరులకు కనిపించకుండా చేయొచ్చు. ఎంతోకాలంగా ఈ ఫీచర్‌ కావాలని కోరుతూ చాలా మంది యూజర్స్ మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ కమ్యూనిటీల్లో సందేశాలు పెడుతున్నారట. అంతేకాకుండా టీమ్స్‌ ద్వారా వీడియో కాల్‌ మధ్యలో స్క్రీన్‌ షేర్ చేసేప్పుడు కుడివైపు చివర్లో యూజర్‌ ఫొటో కూడా కనిపించేది. దీనిపై పలువురు యూజర్స్ ఫిర్యాదు చేయడంతో మైక్రోసాఫ్ట్ 'హైడ్‌ యువర్ ఓన్‌ వీడియో' ఫీచర్‌ను తీసుకొచ్చింది.

భారత్‌ సహా ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతుండటంతో ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయించేందుకే సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ క్లాసులు, సమావేశాల కోసం ఉద్యోగులు ఎక్కువగా టీమ్స్ వంటి వీడియో కాలింగ్ సేవలను అందించే టూల్స్‌పై ఆధారపడతారు. ఈ నేపథ్యంలో టీమ్స్‌ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుందని మైక్రోసాఫ్ట్ చెప్పుకొచ్చింది. గతేడాది చివర్లో మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ కాల్స్‌కు కూడా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి :నీరు, సర్ఫ్​ అక్కర్లేని వాషింగ్ మెషీన్.. ఎలా పని చేస్తుందంటే?

ABOUT THE AUTHOR

...view details