తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఆ యాప్​ ఉంటే 300 మందితో రోజంతా ఫ్రీ వీడియో కాల్‌! - మైక్రోసాఫ్ట్ న్యూ ఫీచర్స్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన వీడియో కాలింగ్ యాప్ 'టీమ్స్'లో.. 300 మంది వ్యక్తిగత వినియోగదారులు ఒకేసారి బృందంగా కలుసుకునే ఫీచర్​ను ఆవిష్కరించింది. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన కుటుంబాలు, స్నేహితులు వర్చువల్​గా మీట్​ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Microsoft Teams
మైక్రోసాఫ్ట్ టీమ్స్

By

Published : May 18, 2021, 6:26 PM IST

ప్రముఖ టెక్​ సంస్థ మైక్రోసాఫ్ట్.. తన వీడియో కాలింగ్ అప్లికేషన్​ 'టీమ్స్​' వ్యక్తిగత వెర్షన్‌ను విడుదల చేసింది. ఇకపై 24గంటల పాటు 300మంది ఒకేసారి వీడియో కాల్‌ ఆప్షన్​ను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. కరోనా నేపథ్యంలో.. స్నేహితులు, కుటుబాల మధ్య రోజంతా ఉచిత వీడియో కాలింగ్‌ను అందించాలని నిర్ణయించింది. సంవత్సరం క్రితం ఐఓఎస్​, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చిందీ మైక్రోసాఫ్ట్.

వెబ్​, మొబైల్, డెస్క్‌టాప్​ వెర్షన్​లో పనిచేయనున్న 'టీమ్స్ పర్సనల్​' ఫీచర్.. వ్యాపారపరంగా అందించే సేవకు ఏమాత్రం తీసిపోదని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఫైల్స్​ను సులభంగా ఓపెన్​ చేయడం, వీడియో కాల్ సమయంలో చాట్ ఆప్షన్ సహా.. వ్యక్తులను సులువుగా యాడ్​ చేసేందుకు అనుమతిస్తుందని పేర్కొంది.

కరోనా తరువాత 60నిమిషాలే.!

అయితే.. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన అనంతరం కేవలం 100 మందికి.. 60 నిమిషాల పాటు గ్రూప్ కాల్​ సదుపాయం కల్పించనున్నట్లు మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఇద్దరికి మాత్రం(1: 1) 24 గంటలు వీడియో కాల్ చేసుకునే వెసులుబాటు ఉండనుంది. అయితే.. మరో వీడియో కాలింగ్ యాప్ స్కైప్‌ను.. టీమ్స్​తో కలిపే అంశాన్ని మైక్రోసాఫ్ట్ ప్రస్తుతానికి ధ్రువీకరించలేదు.

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 145 మిలియన్ల క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది టీమ్స్. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో వినియోగదారులు 'టీమ్స్'కు చేరినట్లు కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు.

ఇవీ చదవండి:శబ్దాలు నియంత్రించే ఏఐ ఫీచర్​తో 'గూగుల్​ మీట్​'

చైనా యాప్​లకు ఇవి ప్రత్యామ్నాయం.. ట్రై చేయండి!

ఈ యాప్​తో ఒకేసారి 300 మందికి వీడియోకాల్

ABOUT THE AUTHOR

...view details