దేశీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ మైక్రోమ్యాక్స్.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇన్ సీరిస్‌లో మంగళవారం స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఇన్ నోట్ 1, ఇన్ 1బీ పేర్లతో రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ స్మార్ట్ఫోన్లు స్టాక్ ఆండ్రాయిడ్‌తో తీసుకొచ్చినట్లు తెలిపింది మైక్రోమ్యాక్స్. వీటిల్లో బ్లోట్‌వేర్, యాడ్లు కూడా ఉండవని స్పష్టం చేసింది. రెండేళ్ల వరకు సాఫ్ట్వేర్ అప్డేట్లు ఉంటాయని హామీ ఇచ్చింది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌పై ఈ రెండు స్మార్ట్ఫోన్లు పని చేయనున్నాయని ఇప్పటి వరకు ఉన్న సమాచారం.
ఇన్ నోట్ 1 ఫీచర్లు..
- 6.67 అంగుళాల అల్ట్రాబ్రైట్ పుల్హెచ్డీ+ డిస్ప్లే
- మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్
- వెనుకవైపు ఏఐతో పని చేసే నాలుగు కెమెరాలు (48 ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
- 16 ఎంపీ వైడ్ యాంగిల్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా (నేరుగా జిఫ్ ఇమేజ్ సేవ్ సదుపాయం)
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్
- 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499
- 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999