దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ 'ఇన్' సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. 'ఇన్ 2బీ' పేరుతో రానున్న ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. కేవలం ఫోన్ మాత్రమే కాకుండా భారత్‌లో ఆడియో సెగ్మెంట్లో కూడా తొలిసారి అడుగుపెట్టనుంది మైక్రోమ్యాక్స్. ఇందుకోసం 'ఎయిర్ ఫంక్ 1', 'ఎయిర్ ఫంక్ 1 ప్రో' అనే రెండు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్‌ను తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫోన్, ఇయర్బడ్స్ల ప్రత్యేకతలు ఏంటి, వాటి ధర ఎంత? అనే విషయాలు ఓసారి చూద్దాం.
'ఇన్ 2బీ' ఫీచర్లు..
- 6.5 అంగుళాల మిని డ్రాప్ హెచ్డీ డిస్ప్లే
- ఆండ్రాయిడ్ 11 ఓఎస్
- మీడియా టెక్ హీలియో జీ80 ప్రాసెసస్
- వెనుకవైపు మూడు కెమెరాలు (13ఎంపీ+2ఎంపీ)
- 5ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- నలుపు, నీలం రంగు, ఆకుపచ్చ రంగుల్లో అందుబాటులోకి
'ఇన్ 2బీ' సిరీస్‌లో 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యం , 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో రెండు వేరియంట్లను కంపెనీ తీసుకురానుంది. వాటి ధరలు ఇలా..
- 4జీబీ+64 జీబీ- రూ.7,999
- 6జీబీ+64జీబీ- రూ.8,999
ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 6 నుంచి ఫ్లిప్కార్ట్లోనూ, మైక్రోమ్యాక్స్ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉండనుంది.
ఎయిర్ ఫంక్ 1, ఎయిర్ ఫంక్ 1 ప్రో పేరుతో తొలిసారిగా ఆడియో సెగ్మెంట్లోకి అడుగుపెడుతుంది మైక్రోమ్యాక్స్. మొత్తం ఐదు రంగుల్లో ఎయిర్ఫంక్ 1, ఎయిర్ఫంక్ 1 ప్రో వస్తున్నాయి. ఎయిర్ఫంక్ 1 మాత్రం బ్లాక్, ఎల్లో, వైట్, పర్పుల్, బ్లూ కలర్స్‌లో రానుండగా.. ఎయిర్ఫంక్ 1 ప్రో బ్లాక్, వైట్, బ్లూ, ఎల్లో, రెడ్ కలర్లలో అందుబాటులో ఉండనుంది.