తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మైక్రోమ్యాక్స్​ ఇన్​1 త్వరలో రిలీజ్- ధర ఎంతంటే.. - మైక్రోమ్యాక్స్ ఇన్​1 విడుదల తేదీ

ఇన్​ సిరీస్​లో మరో బడ్జెట్​ ఫోన్ విడుదల చేయనున్నట్లు మైక్రోమ్యాక్స్ ప్రకటించింది. ఇన్​ 1 పేరుతో ఈ నెల 19న కొత్త మోడల్​ను మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త మోడల్ ఫీచర్లు ఎలా ఉండనున్నాయి? ధర ఎంత ఉండొచ్చు? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం.

In1 price and Features
మైక్రోమ్యాక్స్ ఇన్​1 ధర ఫీచర్లు

By

Published : Mar 15, 2021, 1:11 PM IST

దేశీయ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ 'ఇన్'​ సిరీస్​లో సరికొత్త మోడల్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇన్​ 1 పేరుతో ఈ నెల 19న ఆన్​లైన్​ ఈవెంట్​లో.. ఈ స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించనున్నట్లు మైక్రోమ్యాక్స్ అధికారికంగా ప్రకటించింది.

ఇన్ సిరీస్​లో గత ఏడాది ఇన్ నోట్​ 1, ఇన్​ 1బీ పేర్లతో రెండు బడ్జెట్ ఫోన్లను విడుదల చేసింది మైక్రోమ్యాక్స్. వీటిల్లానే ఇన్​ 1 కూడా స్టాక్ ఆండ్రాయిడ్​తో రానుంది.

ఇన్​ 1 ఫీచర్ల అంచనాలు..

  • 6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే
  • మీడియా టెక్ హీలియో జీ80 ప్రాసెసస్​
  • వెనుకవైపు మూడు కెమెరాలు (48 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 8ఎంపీ పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

ఇన్​ 1ను 6జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ సామర్థ్యం , 4జీబీ ర్యామ్​, 64జీబీ స్టోరేజ్​ సామర్థ్యంతో రెండు వేరియంట్లలో తీసుకురానున్నట్లు సమాచారం. వీటి ధరలు వరుసగా రూ.9,999, రూ.8,999..గా ఉండొచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి:'ఆ ఉద్యోగులను కేంద్రం అలా బెదిరించలేదు'

ABOUT THE AUTHOR

...view details