తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఫేస్​బుక్​, ఇన్​స్టా​లో 'బ్లూ టిక్'.. ధరెంతో తెలుసా? మీకు కావాలంటే ఇలా చేయండి

Meta Blue Tick Subscription : ట్విట్టర్‌ మొదలుపెట్టిన బ్లూటిక్​ విధానాన్ని మెటా సైతం తీసుకువచ్చింది. మెటాకు చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌ సేవలను జూన్​ 7 నుంచి అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ టిక్​ను పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Meta Blue Tick Subscription
Meta Blue Tick Subscription

By

Published : Jun 12, 2023, 10:14 AM IST

Meta Blue Tick Subscription : ఎలాన్‌ మస్క్.. ట్విట్టర్​ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెరిఫైడ్‌ ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్‌ను సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. నెలవారీ రుసుము చెల్లించి యూజర్లు తమ ఖాతాకు బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ పొందే అవకాశాన్ని కల్పించారు. అయితే, తాజాగా ఇదే విధానాన్ని మరో సోషల్‌ మీడియా దిగ్గజం మెటా ఈ నెల 7 నుంచి అందుబాటులోకి తెచ్చింది. మెటాకు చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌ పొందాలంటే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు నెలకు రూ. 699 చెల్లించాలి. దీంతో పాటు రాబోయే రోజుల్లో నెలకు రూ.599కే వెబ్‌ బేస్డ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తెచ్చే ఆలోచనలో మెటా ఉంది. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా సమర్పించి వినియోగదారులు బ్లూటిక్‌ను పొందవచ్చు. దీంతో ఖాతాకు రక్షణ ఉండటమే కాకుండా, కొన్ని రకాల అదనపు ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయని మెటా చెబుతోంది.

ఈ బ్లూటిక్​ ఎలా పొందాలంటే..

  • ముందుగా మీ ఫోన్‌లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లను ఓపెన్‌ చేయాలి.
  • ఏ ప్రొఫైల్‌కు బ్లూ టిక్‌ కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తరువాత సెట్టింగ్స్‌లోని అకౌంట్ సెంటర్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • అక్కడ మెటా వెరిఫైడ్‌ ఆప్షన్​ కన్పిస్తుంది. ఒక వేళ కనిపించని పక్షంలో యాప్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.
  • వైరిఫైడ్‌ ఆప్షన్​ను ఎంపిక చేసుకుని పేమెంట్‌ చెల్లించాలి.
  • మెటా సూచనలన్నీ చదివిన తరువాత ప్రభుత్వ గుర్తింపు కార్డును వెరిఫికేషన్‌ కోసం ఇవ్వాలి.
  • ఆ వెరిఫికేషన్‌ పూర్తైన వెంటనే మీకు బ్లూ టిక్‌ వచ్చేస్తుంది.

ఈ బ్లూ టిక్​ ఎవరికి ఇస్తారంటే..
భారతదేశంలో పుట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ బ్లూ టిక్‌ ఇస్తామని మెటా ప్రకటించింది. ఇలా ఇచ్చే ముందు ఆ యూజర్‌ మునుపటి పోస్టుల గురించి కూడా తనిఖీ చేస్తామని చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టింది. వాటిలోని పేరు, ఫొటో.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోని వివరాలతో సరిపోలితేనే బ్లూ టిక్‌ వస్తుంది.

గతంలో ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను వార్తా సంస్థలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్షర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ఖాతాలకు మాత్రమే ఇచ్చేవారు. ఇందుకోసం వారు సోషల్‌ మీడియా సంస్థలకు కొన్ని వివరాలు సమర్పించేవారు. వాటి ఆధారంగా ఖాతాలకు బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ నిబంధనను సడలించారు. నెలవారీ రుసుము చెల్లించి ఎవరైనా బ్లూ టిక్‌ పొందొచ్చు. మెటా బ్లూ టిక్‌ ఫీచర్‌ అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడా, న్యూజిలాండ్‌ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే అమల్లో ఉంది.

ఇవీ చదవండి :ఆ ఖాతాలకు ట్విట్టర్ బ్లూటిక్ ఉచితం.. ఎలన్​ మస్క్ బంపర్ ఆఫర్

Whatsapp Channel vs Group : ఈ రెండింటి మధ్య తేడాలు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details