మరో విప్లవాన్ని సృష్టించేందుకు సిద్ధమైంది ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్(Mercedes Benz). మానవ మెదడును చదివేసే టెక్నాలజీతో ఓ కారును తయారు చేయనుంది. దీనికి సంబంధించిన నమూనాను జర్మనీ మ్యూనిచ్‌లో జరుగుతోన్న ఐఏఏ మొబిలిటీ షో 2021(iaa mobility 2021)లో ప్రదర్శించింది. ఇంతకుముందు సీఈఎస్ 2020 షోలోనూ దీనిని బహిర్గతం చేసింది. 'అవతార్' సినిమా టెక్నాలజీ స్ఫూర్తితో ఈ కారును తయారు చేశారు. అందుకే ఈ మోడల్‌కు మెర్సిడెజ్ బెంజ్ ఏవీటీఆర్(mercedes benz avtr)గా నామకరణం చేశారు.
ETV Bharat / science-and-technology
మెర్సిడెజ్ బెంజ్ సరికొత్త కారు- మీ ఆలోచనే నడిపిస్తుంది ! - విజువల్ పర్సెప్షన్తో మెర్సిడెజ్ బెంజ్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్(Mercedes Benz).. మానవ ఆలోచనలతో ప్రయాణం సాగించే ఓ కారును రూపొందిస్తోంది. మ్యూనిచ్ జర్మనీలో జరుగుతోన్న ఐఏఏ మొబిలిటీ షో(iaa mobility 2021)లో ఈ సాంకేతికత గల కారు(mercedes benz avtr)ను ప్రదర్శనకు ఉంచింది.

ఈ టెక్నాలజీ సాయంతో మీరు ఎలా ఊహిస్తారో కారు అలా ప్రయానిస్తుంది. ఇందులో స్టీరింగ్ ఉండదు. మీ ఆలోచనల్ని బట్టే దాని కదలికలు ఉంటాయి. ఈ సాంకేతికత విజువల్ పర్సెప్షన్ (దృశ్య అవగాహన) ఆధారంగా పనిచేస్తుంది. చోదకుడి తలకు బీసీఐ (బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్) అనే పరికరాన్ని అమర్చడం ద్వారా ఇది సాధ్యం కానుందని వెల్లడించారు సంస్థ అధికారులు.
ఇదంతా చదువుతుంటే ఇది అసలు సాధ్యమేనా? కేవలం నమూనా వరకే పరిమితమా? అంటే.. కాదు. మీరు ఈ సాంకేతికతను ట్రై చేయొచ్చు కూడా. ఐఏఏ మొబిలిటీ షోకు వెళ్లి మెర్సిడెజ్ బెంజ్ బూత్‌లో ఈ టెక్నాలజీని ప్రయత్నించి చూడొచ్చు.