మాస్క్.. ఇప్పుడు కరోనాను అడ్డుకునే రక్షణ కవచమే కాదు.. ఓ ఫ్యాషన్ సింబల్ కూడా. కానీ దీన్ని అంతకుమించి ఓ గ్యాడ్జెట్‌లా మార్చేసింది మాస్క్‌ఫోన్ (MASKFONE).
ఏంటి ప్రత్యేకత?
రక్షణ, సౌకర్యం, సొగసు, సాంకేతికత కలిపితే మా కొత్త మాస్క్ అంటోంది మాస్క్‌ఫోన్. ఇది మూడు పొరల మాస్క్ కమ్ గ్యాడ్జెట్. సాధారణంగా ఫోన్ మాట్లాడేటప్పుడో, మ్యూజిక్ వింటున్నప్పుడో మాస్క్ తీయాల్సి వస్తుంది. మాస్క్‌ఫోన్‌తో ఆ అవసరం లేదు. ఇయర్‌ఫోన్స్‌ను చెవుల్లో పెట్టుకొని వై-ఫైతో అనుసంధానం చేసుకోవచ్చు.