తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మీ ఫోన్​లో ఈ 35 యాప్స్​లో ఏదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయండి - dangerous apps on android

లక్షలాది డౌన్​లోడ్స్​తో చాలా పాపులర్​ యాప్స్​లా కనిపిస్తాయి. వాల్​పేపర్స్, గేమ్స్ మొదలు జీపీఎస్​ వరకు అన్ని రకాల సేవలు అందించేలా భ్రమ కలిగిస్తాయి. కానీ వాటిని డౌన్​లోడ్ చేస్తే అంతే సంగతులు అంటున్నారు టెక్ నిపుణలు. మాల్​వేర్​తో వ్యక్తిగత సమాచారం తస్కరించగల ఆ 35 యాప్స్​లో ఒక్కటి మీ స్మార్ట్​ఫోన్​లో ఉన్నా తక్షణమే డిలీట్ చేయమని సూచిస్తున్నారు.

malicious android apps list 2022
మీ ఫోన్​లో ఈ 35 యాప్స్​లో ఏదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయండి

By

Published : Aug 18, 2022, 7:21 PM IST

Malicious Android apps list 2022 : గూగుల్​ ప్లేస్టోర్​లో ఉన్న 35 యాప్స్​తో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ బిట్​డిఫెండర్. ఆ యాప్స్.. అనవసరమైన యాడ్స్​ పంపుతూ, వ్యక్తిగత సమాచారం తస్కరించే అవకాశముందని స్పష్టం చేసింది. తెలియక డౌన్​లోడ్​ చేస్తే.. అత్యంత తెలివిగా రూపం మార్చుకుని మరీ డేటా చోరీ చేయడం ఆ యాప్స్​ ప్రత్యేకతని వివరించింది బిట్​ డిఫెండర్. ఆ 35 యాప్స్​లో ఒక్కటి ఉన్నా.. మీ మొబైల్​ నుంచి తక్షణమే అన్​ఇన్​స్టాల్ చేయాలని సూచించింది.

బిట్​డిఫెండర్ బ్లాగ్ ప్రకారం.. వాల్​పేపర్స్​ నుంచి జీపీఎస్​ వరకు వేర్వేరు కేటగిరీల్లో ఆ యాప్స్ ఉన్నాయి. ఒక్కోటి వేలు, లక్షలు చొప్పున.. మొత్తంగా 35 యాప్స్​ 20లక్షలకుపైగా డౌన్​లోడ్స్​ సంపాదించాయి. తెలియక ఇన్​స్టాల్​ చేసుకున్నాక ఇవి అసలు పని మొదలుపెడతాయి. ముందుగా యాప్ పేరు, ఐకాన్ మారిపోతాయి. రీసెంట్​లీ యూజ్డ్​ యూప్స్​ లిస్ట్​లోనూ అవి కనిపించవు. ఫలితంగా.. బ్యాక్​గ్రౌండ్​లో రన్​ అవుతున్నాయని తెలుసుకునే వీలు కూడా ఉండదు.

ఉదాహరణకు.. జీపీఎస్​ లొకేషన్​ అనే యాప్ డౌన్​లోడ్ చేసుకుంటే.. సెట్టింగ్స్​ అని దాని పేరును, ఐకాన్​ను మార్చేసుకుంటుంది. సెట్టింగ్స్​ అంటే మన ఫోన్​లో డిఫాల్ట్​గానే ఉంటుంది కాబట్టి మనం పట్టించుకోము. అప్పుడు ఆ యాప్​.. మన ఫోన్​లో అనవసరమైన యాడ్స్​ వచ్చేలా చేస్తుంది. యాడ్స్​ తరహాలోనే మన ఫోన్​లోకి మాల్​వేర్ ప్రవేశించి.. వ్యక్తిగత వివరాలు తస్కరించే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఆ యాప్స్​కు దూరంగా ఉండడమే మేలని చెబుతోంది టెక్​డిఫెండర్.

ఆ యాప్స్ వివరాలు:

  • Walls light - Wallpapers Pack
  • Big Emoji - Keyboard
  • Grad Wallpapers - 3D Backdrops
  • Engine Wallpapers - Live & 3D
  • Stock Wallpapers - 4K & HD
  • EffectMania - Photo Editor
  • Art Filter - Deep Photoeffect
  • Fast Emoji Keyboard
  • Create Sticker for Whatsapp
  • Math Solver - Camera Helper
  • Photopix Effects - Art Filter
  • Led Theme - Colorful Keyboard
  • Keyboard - Fun Emoji, Sticker
  • Smart Wifi
  • My GPS Location
  • Image Warp Camera
  • Art Girls Wallpaper HD
  • Cat Simulator
  • Smart QR Creator
  • Colorize Old Photo
  • GPS Location Finder
  • Girls Art Wallpaper
  • Smart QR Scanner
  • GPS Location Maps
  • Volume Control
  • Secret Horoscope
  • Smart GPS Location
  • Animated Sticker Master
  • Personality Charging Show
  • Sleep Sounds
  • QR Creator
  • Media Volume Slider
  • Secret Astrology
  • Colorize Photos
  • Phi 4K Wallpaper - Anime HD

ప్లేస్టోర్​లో యాప్​ ఇన్​స్టాల్ చేస్తున్నారా.. ముందు వీటిని చెక్ చేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details