తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మార్కెట్లోకి నయా మొబైళ్లు.. స్మార్ట్​ఫోన్​ ప్రియులకు పండగే! - festival offers mobile phones

కొత్త ఫోన్​ కొనాలన్న ఆలోచనలో ఉన్నవారు సిద్ధమైపోండి అని అంటున్నాయి మొబైల్​ కంపెనీలు. అక్టోబర్​లో దసరా పండుగ నేపథ్యంలో సరికొత్త స్మార్ట్​ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నాయి సంస్థలు. మరి ఈ నెలలో రానున్న స్మార్ట్​ ఫోన్​ వివరాలు తెలుసుకుందామా..

latest phone updates
smart phones

By

Published : Sep 30, 2022, 12:21 PM IST

Updated : Nov 28, 2022, 1:08 PM IST

కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి అక్టోబరు నెలలో ఎన్నో ఆప్షన్లు. ఈ-కామర్స్‌ సంస్థల పండగ ఆఫర్లు ఓ వైపు.. ప్రత్యేక ఆఫర్ల పేరుతో మొబైల్ కంపెనీల ఆఫర్లు మరోవైపు. వీటికి తోడు మొబైల్ కంపెనీలు కొత్తగా విడుదల చేసే మోడల్స్‌ ఉండనే ఉన్నాయి. పండగ ఆఫర్ల గురించి ఇప్పటికే ఈ-కామర్స్‌, మొబైల్‌ కంపెనీలు విస్తృత ప్రచారం నిర్వహించాయి. మరి, అక్టోబరులో కొత్తగా విడుదయ్యే మోడల్స్‌ మాటేంటి? ఇదిగో జాబితా.. మరింకెందుకు ఆలస్యం.. దానిపై మీరూ ఓ లుక్కేయండి...

పిక్సెల్ 7 సిరీస్‌ (Pixel 7 Series)

గూగుల్ కంపెనీ పిక్సెల్ 7 సిరీస్‌తో భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో పేరుతో రెండు మోడల్స్‌ను అక్టోబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ల అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభంకానున్నాయి. వీటి ధర ₹ 55 వేల నుంచి ప్రారంభమవుతుందని మార్కెట్ వర్గాల అంచనా.

మోటో ఎడ్జ్‌ 30 నియో (Moto Edge 30 Neo)

గత కొద్ది నెలలుగా షావోమి, ఒప్పో తరహాలో మోటోరోలా కూడా వరుసగా కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తోంది. అక్టోబరు నెలలో కూడా మోటో ఎడ్జ్‌ 30 నియో మోడల్‌ను విడుదల చేయనుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.28 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ డిస్‌స్లే ఉంటుందని సమాచారం. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. వెనుక 64 ఎంపీ, 13 ఎంపీ కెమెరాలు, ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారట. 4,020 ఎంఏహెచ్ బ్యాటరీ 68 వాట్, 5వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్ ధర ₹ 20 వేలలో ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 (OnePlus Nord 3)

నార్డ్‌ సిరీస్‌లో వన్‌ప్లస్‌ కంపెనీ మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తుంది. వన్‌ప్లస్‌ నార్డ్ 3 పేరుతో విడుదల చేయనున్న ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌ను ఉపయోగించారట. వెనుక 50 ఎంపీ కెమెరాతోపాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నట్లు సమాచారం. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. వన్‌ప్లస్ నార్డ్ 3 ధర ₹ 30 వేల నుంచి ₹ 35 వేల మధ్య ఉంటుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబరు చివరి వారంలో విడుదలవుతుందని అంచనా.

షావోమి 12టీ సిరీస్‌ (Xiaomi 12T Series)

120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 2k అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట.రెండు వేరియంట్లో ఈ ఫోన్‌ను విడుదల కానుంది. ఒక వేరియంట్‌లో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వెనుకవైపు 200 ఎంపీ ప్రధాన కెమెరా, స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ ‌1 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. మరో మోడల్‌లో 5,000 ఎంఏహెచ్‌ 67వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌ ఫీచర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. షావోమి ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌లో ఈ సిరీస్‌ మోడల్స్‌ను తీసుకొస్తుంది. వీటి ధర ₹ 50 వేల నుంచి ₹ 60 వేల మధ్య ఉంటుందని సమాచారం.

షావోమి 12 లైట్‌ (Xiaomi 12 Lite)

అక్టోబరు రెండు లేదా మూడో వారంలో ఈ ఫోన్ విడుదలకానుంది. ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.55 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక 108 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారట. ధర ₹ 30 వేలలోపలే ఉంటుందని అంచనా.

ఐకూ నియో 7 (iQoo Neo 7)

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 120హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇతర ఫీచర్ల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

రియల్‌మీ 10 సిరీస్‌ (Realme 10 Series)

రియల్‌మీ కంపెనీ 10 సిరీస్‌లో వేర్వేరు వేరియంట్లను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో తొలి ఫోన్‌ను అక్టోబరులో తీసుకురానుంది. తర్వాత 10 ప్రో, 10 5జీ, 10 అల్ట్రా, 10+ వేరియంట్లను పరిచయం చేస్తుందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. దీనితోపాటు అక్టోబరులో రియల్‌మీ జీటీ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను తీసుకొస్తుంది. ఇది కంపెనీ నుంచి జీటీ సిరీస్‌లో వస్తోన్న నాలుగో మోడల్‌. రియల్‌మీ జీటీ నియో 4 (Realme GT Neo 4) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 1.5k అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 100 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

వివో వి25ఈ (Vivo V25E)

ఈ ఫోన్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.44 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ ఉపయోగించారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 44 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ధర ₹ 20 వేలలోపలే ఉంటుందని అంచనా.

పోకో ఎమ్‌5ఎస్‌ (Poco M5s)

ఎమ్‌ సిరీస్‌లో పోకో నుంచి వస్తోన్న ఆరో మోడల్‌. ఇందులో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌ ఉపయోగించినట్లు తెలుస్తోంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయని సమాచారం. ధర ₹ 15 వేల లోగా ఉంటుందని టెక్‌ వర్గాలు తెలిపాయి.

ఒప్పో ఏ సిరీస్‌ (Oppo A Series)

బడ్జెట్‌ రేంజ్‌లో ఒప్పో కంపెనీ ఏ సిరీస్‌లో రెండు ఫోన్లను తీసుకురానుంది. ఒప్పో ఏ17 (Oppo A17), ఒప్పో ఏ77ఎస్‌ (Oppo A77s). ఈ రెండు ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ను ఉపయోగించారని సమాచారం. ఏ17లో ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఏ77ఎస్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. రెండింటిలో వెనుకవైపు 50 ఎంపీ కెమెరా అమర్చినట్లు సమాచారం. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుందట. వీటి ధర ₹ 9 వేల నుంచి ₹ 10 వేల మధ్య ఉంటుందని అంచనా.

ఇదీ చదవండి:గూగుల్​ క్రోమ్​లో 5 సూపర్​ ట్రిక్స్​.. ఇవి తెలిస్తే బ్రౌజింగ్ మరింత ఈజీ

వాట్సాప్ యూజర్లకు గుడ్​న్యూస్.. కొత్తగా మెసేజ్ ఎడిట్ ఫీచర్!

Last Updated : Nov 28, 2022, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details