కరోనా వల్ల మార్చి నుంచి అమ్మకాలు లేక స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు వెలవెలబోతున్నాయి. ఇటీవల లాక్డౌన్ సడలింపులతో మార్కెట్లో మళ్లీ సందడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు పోటాపోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి.
ఇందులో భాగంగా ఈ నెల 22న ఆసుల్ ఆర్ఓజీ ఫోన్ 3ను విడుదల చేయనుండగా..అదే రోజు లెనోవో సరికొత్త మోడల్ గేమింగ్ లీజెన్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇది ప్రధానంగా గేమ్స్ ఆడేవారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్లుగా తెలుస్తోంది. లెనోవో లీజెన్ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లతో పాటు ఫొటోలు లీకయ్యాయి. ఫోన్ ఖరీదు సుమారు రూ. 50వేల వరకు ఉండొచ్చని అంచనా.
లీకైన ఫీచర్లు ఇవే..
- లెనోవో లీజెన్ రెగ్యులర్, ప్రొ వెర్షన్స్‌లో విడుదల కానుందని సమాచారం.
- లీజెన్ ఫోన్ డిస్‌ప్లేను పల్చటి ఫ్రేమ్‌తో రూపొందించింది. ఎలాంటి కటౌట్స్, రంధ్రాలు లేకపోవడాన్ని ఎక్కువ మంది ఇష్టపడతారని సంస్థ పేర్కొన్నట్లు తెలిసింది.
- ఫోన్ పైభాగం, కిందవైపున రెండు స్పీకర్ల కోసం హోల్స్ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగాన్ని ఆకర్షణీయంగా రూపొందించింది.
- రెండు రంగులను పెయింట్ చేసి నిగనిగలాడేలా తయారు చేసింది.
- కింద, పైన భాగాలను గ్రిప్ కోసం కార్బన్ ఫైబర్‌తో రూపొందించడం వల్ల గేమ్ ఆడేటప్పుడు పట్టుకునేందుకు అనువుగా ఉంటుంది.
- ప్రధాన కెమెరాలో రెండు లెన్స్‌లు ఉన్నాయి. ఫోన్ కుడివైపు, ఎడమ వైపున ట్రిగ్గర్ బటన్స్ చూడొచ్చు.
ఇదీ చూడండి:'మరో రూ.వెయ్యి కోట్ల ఏజీఆర్ బకాయి చెల్లించాం'