తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఇన్‌స్టాలో వానిష్‌ మోడ్‌.. మెసేజ్​లన్నీ మాయం! ఎలా ఎనేబుల్​ చేయాలో తెలుసా? - ఇన్‌స్టాగ్రామ్‌ వానిష్ మోడ్​ ఎనేబుల్​ ఎలా

Instagram Vanish Mode : ఆన్‌లైన్‌ చాటింగ్ చేసే వారి వ్యక్తిగత గోప్యత కోసం ప్రైవసీ ఫీచర్లు ఉపయోగించమని సోషల్‌ మీడియా సంస్థలు సూచిస్తున్నాయి. వీటిని ఆయా కంపెనీలు వేర్వేరు పేర్లతో యూజర్లకు పరిచయం చేశాయి. పిలిచే పేర్లే వేరయినా.. ఇవి చేసే పనిమాతరం యూజర్ల గోప్యతకు భంగం కలగకుండా చేయడమే.

vanish-mode-in-instagram
ఇన్‌స్టాలో వానిష్‌ మోడ్‌vanish mode instagram

By

Published : Nov 8, 2022, 9:11 AM IST

Instagram Vanish Mode : యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా సోషల్‌మీడియా యాప్‌లు ప్రైవసీ ఫీచర్లను తీసుకొచ్చాయి. వీటిలో డిస్‌అప్పియర్‌/ వానిష్‌ మోడ్‌ కీలక ఫీచర్లని ఆయా సంస్థలు చెబుతున్నాయి. ఈ ప్రైవసీ ఫీచర్ల ద్వారా పంపిన మెసేజ్‌/ఫొటో/వీడియోలు రిసీవర్‌ చూసిన లేదా చాట్ పేజ్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతాయి. దీంతో యూజర్‌తో చాట్ చేసిన వ్యక్తులు వాటిని సేవ్‌, కాపీ, ఫార్వార్డ్, స్క్రీన్‌షాట్, స్క్రీన్‌ రికార్డింగ్ వంటివి చేయలేరు.

అందుకే సోషల్‌ మీడియా సంస్థలు వ్యక్తిగత గోప్యత కోసం వీటిని ఉపయోగించడం మేలని సూచిస్తున్నాయి. ఫొటో/వీడియో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్‌ ప్రైవసీ కోసం వానిష్‌ మోడ్‌ ఉంది. ఈ మోడ్‌ ఎనేబుల్‌ చేస్తే మీ ప్రెండ్‌లిస్ట్‌లోలేని, మీరు గతంలో కనెక్ట్ కాని వ్యక్తులు మెసేజ్‌ రిక్వెస్ట్ కూడా పంపలేరు. ఒకవేళ అవతలి వ్యక్తి మీ ఫొటో/వీడియో/మెసేజ్‌లను సేవ్‌, కాపీ, ఫార్వార్డ్‌ చేసేందుకు ప్రయత్నిస్తే అలర్ట్‌ నోటిఫికేషన్‌ ద్వారా తెలియజేస్తుంది. మరి, ఇన్ని ప్రయోజనాలున్న వానిష్‌ మోడ్‌ను ఇన్‌స్టాలో ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందామా..?

ఇన్‌స్టాలో వానిష్‌ మోడ్‌
  • ఫోన్‌లో ఇన్‌స్టా యాప్‌ ఓపెన్‌ చేసి, అందులో కుడివైపు పైన ఉన్న సెండ్‌ లేదా మెసెంజర్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • వానిష్ మోడ్‌ ద్వారా మీరు మెసేజ్‌/ఫొటో/ వీడియో పంపాలనుకుంటున్న వ్యక్తి చాట్ పేజీ ఓపెన్‌ చేసి, స్క్రీన్ మీద పైకి స్వైప్‌ చేస్తే వానిష్ మోడ్‌ ఎనేబుల్ అయినట్లు కనిపిస్తుంది.
  • తర్వాత మీరు చాట్ చేసి, పేజీ నుంచి బయట వస్తే, అప్పటివరకు చాట్ పేజీలో ఉన్న సంభాషణలు ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతాయి.
  • ఒకవేళ వానిష్‌ మోడ్‌ వద్దనుకుంటే.. చాట్‌ పేజీని మరోసారి పైకి స్వైప్‌ చేస్తే వానిష్‌ మోడ్‌ డిసేబుల్ అవుతుంది.

ABOUT THE AUTHOR

...view details