How to temporarily disable location sharing: ఫోన్‌లో మనం డౌన్‌లోడ్ చేసే ప్రతి యాప్ దాదాపు లొకేషన్ అనుమతి కోరుతుంది. సదరు యాప్ సేవలకు, లొకేషన్ డేటాకు ఎలాంటి సంబంధం లేకున్నా యూజర్ డేటా సేకరణ కోసం ఇలాంటి అనుమతులు కోరుతుంటాయి. అందుకే ముందుగా ఏఏ యాప్స్ మీ లొకేషన్ డేటాను ట్రాక్ చేస్తున్నాయనేది తెలుసుకోవాలి. అంటే మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే లొకేషన్ ఆన్ చేయమని అడిగే యాప్స్. వాటిలో ఏ యాప్స్ సేవలకు తప్పనిసరిగా లొకేషన్ అనుమతి అవసరం అనేది గుర్తించాలి. ఉదాహరణకు పైన పేర్కొన్నట్లు ఫుడ్ డెలివరీ, రైడింగ్ యాప్స్, గూగుల్ మ్యాప్స్ వంటి వాటికి లొకేషన్ అనుమతి ఉండాలి. ఇవి కాకుండా కొన్ని సోషల్ మీడియా యాప్స్, వీడియో స్ట్రీమింగ్ యాప్స్, ఫిన్‌టెక్ యాప్స్ కూడా యూజర్ లొకేషన్ డేటాను ట్రాక్ చేస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థలు తెలిపాయి.
అడ్డుకోవడం ఎలా..?
ఇటీవలి కాలంలో సమాచార మార్పిడిలో సోషల్ మీడియా యాప్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు యూజర్లు నుంచి డేటా (ఆన్‌లైన్‌లో దేనికోసం ఎక్కువగా వెతుకుతున్నారు, ఎక్కడెక్కడికి వెళుతున్నారు, ఆన్‌లైన్ షాపింగ్) సేకరించి దానికనుగుణంగా ప్రకటనలు పంపుతుంటాయి. ఇది తప్పనిసరిగా యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లే చర్యగా టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి యాప్స్‌కు లొకేషన్ డేటా డిసేబుల్ చేసేందుకు ఈ కింది విధంగా చేయాలి.