తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

అంతరిక్ష పర్యటనపై ఆసక్తా? ఇది మీకోసమే.. - అంతరిక్షంలో ఏమైన జరిగితే ఎటువంటి చట్టాలు వర్తిస్తాయి?

రోదసి పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా బిలియనీర్ల అంతరిక్ష యాత్రలు ఈ నెలలో విజయవంతం అయ్యాయి. దీంతో చాలా మంది స్పేస్​ టూరిజం వైపు అడుగులు వేస్తున్నారు. కొందరైతే ఇప్పటికే ఆయా సంస్థలకు పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి టికెట్లు కూడా బుక్​ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష పర్యాటకం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..

space tourism
అంతరిక్ష పర్యాటకం

By

Published : Jul 24, 2021, 7:57 PM IST

అంతరిక్ష పర్యటనకు సంబంధించి జులైలో కీలక ముందడుగు పడింది. ప్రపంచ కుబేరులు రిచర్డ్​ బ్రాన్సన్​, జెఫ్​ బేజోస్​లు ఆకాశవీధికిఎగిరి వారి పేర్లను సువర్ణాక్షారాలతో లిఖించుకున్నారు. ఒకరు నేల నుంచి 85 కిలోమీటర్లకుపైగా ఎత్తుకు ఎగిరితే మరోకరు మరో అడుగు ముందుకు వేసి 106 కిలోమీటర్ల పైకివెళ్లివచ్చారు. ఇలా భారరహిత స్థితిని తొలిసారి అనుభూతి చెందారు. ఈ దృశ్యాలను ప్రపంచంలోని ప్రజలు ఎంతో ఆసక్తిగా వీక్షించారు.

ఈ క్రమంలోనే ఇరువురు కంపెనీలైన వర్జిన్​ గెలాక్టిక్​, బ్లూ ఆరిజన్​లకు మంచి మీడియా కవరేజ్​ కూడా లభించింది. దీంతో అంతరిక్ష పర్యటన అనేది లాభదాయకమైన వాణిజ్య పరిశ్రమగా అవతరించింది. ఈ రెండు ఘటనలతో వేలాది మంది ప్రయాణికులు స్పేస్​లోకి వెళ్లి రావడానికి టికెట్లు బుక్​ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇందుకోసం మిలియన్​ డాలర్లను ఖర్చు చేస్తున్నారు. అయితే అంతరిక్ష ప్రయాణం చేయాలి అనుకునే వారు కొన్నింటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు. అవి ఏంటంటే..

ఎక్కడ నుంచి అంతరిక్ష పరిధి ప్రారంభమవుతుంది?

భూమి నుంచి ఎంత ఎత్తులో అంతరిక్ష పరిధి ప్రారంభమవుతుంది అనేదానికి కచ్చితమైన నిర్వచనాలు అంటూ ఏమీ లేవు. దీనికి ఫలానా దగ్గర నుంచి మొదలు.. చివర అనేది ఏమీ లేదు. అయితే అంతరిక్షానికి సరిహద్దులు లేవు అనేది మనం ఇక్కడ గమనించాలి.రిచర్డ్​ బ్రాన్సన్ ప్రకారం అంతరిక్షం భూమి నుంచి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అదే జెఫ్​ బెజోస్​ ప్రకారం 100 కిలోమీటర్ల పైనే ఉంది. అయితే గతంలో అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య.. కర్మన్​రేఖ(భూమి వాతావరణం- రోదసి సరిహద్దు)ను ప్రమాణికంగా చెప్పుకొచ్చింది. కానీ అది వాతావరణంలోని వివిధ పొరల ప్రకారం దానిని సాంకేతిక సరహద్దుగా పరిగణించలేకపోయారు.

అంతరిక్ష పర్యటకులు అందరూ వ్యోమగాములేనా? ​

అంతరిక్ష పర్యటనకు వెళ్లిన వారందరినీ వ్యోమగాములుగా పరిగణిస్తారా? అంటే దానికి సమాధానం కచ్చింతంగా 'నో' అనే వినిపిస్తుంది. 60ఏళ్ల నుంచి ఇప్పటివరకు సుమారు 600 మంది స్పేస్​లోని వెళ్లారు. కానీ వారందరినీ వ్యోమగాములుగా పరిగణించలేదు! ఇదిలా ఉంటే 1967 యూఎన్​ అవుటర్ స్పేస్​ ఒప్పందం ప్రకారం వ్యోమగాములను అంతరిక్ష్యంలో మానవజాతి దూతలుగా అభివర్ణించారు. ఆ తరువాత 1968 ఒప్పందం ప్రకారం స్పేస్​ క్రాఫ్ట్​లో వెళ్లిన వారిని మాత్రమే పూర్తిస్థాయి వ్యోమగామిగా పరిగణించారు. దాని తదనాంతరం జరిగిన పరిణామాల ప్రకారం స్పేస్​ టూరిజం కంపెనీలు అన్నీ వారి ప్రయాణికులకు వ్యోమగాములు అనే ముద్రను వేశాయి.

అంతరిక్షంలో ఏమైన జరిగితే ఎటువంటి చట్టాలు వర్తిస్తాయి?

అంతరిక్షయానం చేయడం అనేది సహసంతో కూడుకున్నదే. పైకి వెళ్లిన వ్యక్తి కిందకి వస్తారు అనే నమ్మకం ఇప్పటికీ చాలా మందికి లేదు. 1986లో ఛాలెంజర్​, 2003లో చోటు చేసుకున్న కొలంబియా షటిల్​ ప్రమాదాలను గుర్తుకు తెచ్చుకుంటే అంతరిక్షయానం ఎంత ప్రమాదమో అర్థం అవుతుంది. వాస్తవానికి స్పేస్​లోకి వెళ్లే వారికి సరైన శిక్షణ ఇస్తారు. సాధ్యమైనంత ఎక్కువ భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. కానీ తప్పులు జరగవు అని చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రభుత్వ ప్రాయోజిత అంతరిక్ష ప్రయాణం అనేది అంతరిక్ష పర్యటనతో పోల్చితే పూర్తిగా వేరు. ఇందుకు సంబంధించి న్యాయబద్ధమైన వ్యవస్థ అవసరమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఓ వ్యోమగామికి ప్రయాణంలో గాయాలైనా.. ప్రాణం పోయినా ఇతరాత్ర ఏవిధమైన ఇబ్బంది ఎదురైనా.. దానికి ఎవరూ బాధ్యులుకారని 1972 యూఎన్​ లయబలిటీ కన్వెన్షన్​ చెప్తుంది. దీని ప్రకారం వారి కుటుంబ సభ్యులు పరిహారం పొందలేరు. అయితే ఆయా దేశాల చట్టాలకు లోబడి పరిహరం పొందే అవకాశం ఉండొచ్చు. అందుకే సంబంధిత సంస్థలు అగ్రిమెంట్​పైన సంతకం చేయించుకుంటాయి. అందుకే స్పేస్​ టూరిజంకు ప్రత్యేక వ్యవస్థ, చట్టాలు అవసరం అనే వాదన వినిపిస్తోంది.

అంతరిక్షంలో అవి కూడా చేయెచ్చా?

అంతరిక్ష పర్యాటకం ప్రారంభ దశ నుంచే కొన్ని ఆసక్తికరమైన నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్పేస్​లో వేశ్యాగృహాలు ఉండొచ్చా? పేకాట ఆడవచ్చా? లేద భూమిమీద లాగా పెద్ద పెద్ద ప్రకటనల బోర్డులు పెట్టవచ్చా? లేదా.. ఒకవేళ పెడితే వీటికి ఏఏ చట్టాలు వర్తిస్తాయి? ఇలా చాలా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇలాంటివి కేవలం అన్ని దేశాల ఉమ్మడి ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతరిక్ష పర్యటన వల్ల వాతావరణం దెబ్బ తింటుందా?

స్పేస్​ టూరిజం వల్ల వందకు వందశాతం భూమి పర్యవరణంపై ప్రభావం పడుతుంది. ట్రాఫిక్​ ఎక్కువ అయితే అంతరిక్షంలోకి వెళ్లే వాహనాల నుంచి కర్బన ఉద్గారాలు అధికంగా వెలువడే అవకాశం ఉంది. అందుకే పలు జాగ్రత్తలతో వీటికి అనుమతులు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

పర్యటక సిబ్బంది అంతరిక్షంలో జీవించాల్సి వస్తుందా?

స్పేస్​లో టూరిజం కార్యకలాపాలు ఎక్కువ అయితే అంతరిక్షంలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది అవసరం పెరుగుతుంది. అప్పుడు వారు అక్కడే జీవించాలి. స్పేస్​లో ఉంటే ఎలా? పొరపాటున అక్కడి వారి పిల్లలు పుడితే వారికి ఎటువంటి చట్టాలు వర్తిస్తాయి? భూమి మీద వారికి అనుమతి ఉంటుందా? వారిని అంతరిక్ష పౌరులుగా గుర్తించాలా? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రస్తుతానికి ఈ యాత్రలు శ్రీమంతులకు మాత్రమే పరిమితమైనప్పటికీ.. ఇప్పటి నుంచే ఇవన్నీ ఆలోచన చేయాలి అంటున్నారు నిపుణులు.

ఇవీ చూడండి:

చరిత్ర సృష్టించిన బెజోస్​- స్పేస్​ టూర్​ సక్సెస్​

రోదసిలో కొత్త చరిత్ర- రిచర్డ్ అంతరిక్ష యాత్ర సక్సెస్

అంతరిక్షం అంచుకు వెళ్లాలా? ఎంత ఖర్చవుతుందంటే..

ABOUT THE AUTHOR

...view details