తక్కువ ధరలో.. ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో జియో టెలికాం సంస్థ గూగుల్‌తో కలిసి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ 'జియోఫోన్ నెక్ట్స్'ను(Jiophone next) తీసుకురానుంది. గత నెలలో వినాయకచవితి సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తారని భావించినప్పటికీ వివిధ కారణాలతో విడుదల వాయిదా పడింది. దీంతో ఈ ఫోన్‌ను(Jiophone next) దీపావళికి మార్కెట్లోకి తీసుకొస్తామని సంస్థ వెల్లడించింది. తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్ల వివరాలు గూగుల్ ప్లే కన్సోల్ నుంచి లీక్ అయినట్లు అభిషేక్ యాదవ్ అనే టిప్‌స్టర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అవేంటో చూద్దాం.
ETV Bharat / science-and-technology
JioPhone Next: జియో ఫోన్ వివరాలు లీక్.. ఈ సారి గూగుల్ నుంచి! - జియో నెక్ట్స్ ఫోన్ ఫీచర్లు లీక్ అప్డేట్స్
జియో టెలికాం సంస్థ.. గూగుల్‌తో కలిసి తీసుకురానున్న 'జియోఫోన్ నెక్ట్స్'(Jiophone next) స్మార్ట్‌ఫోన్ సంబంధించిన విషయాలు లీక్ అయినట్లు సమాచారం. దీని ఫీచర్ల వివరాలు గూగుల్ ప్లే కన్సోల్ నుంచి లీక్ అయినట్లు అభిషేక్ యాదవ్ అనే టిప్‌స్టర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
జియో నెక్ట్స్ ఫోన్(Jiophone next) ఆండ్రాయిడ్ 11 ఆధారిత గో ఎడిషన్‌తో పనిచేస్తుందట. ఇది లైట్ వెర్షన్ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎమ్215 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. 4జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుందట. 2 జీబీ ర్యామ్ ఉంటుందని సమాచారం. 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. కెమెరాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ ఫోన్‌కి(Jiophone next) రెండు వైపులా 13 ఎంపీ కెమెరా ఇస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు తెలియాల్సివుంది. ఈ ఫోన్‌లో వాయిస్ అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్-అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయని సమాచారం. ఈ ఫోన్(Jiophone next) ధర సుమారు రూ. 3,500 నుంచి రూ. 5,000 ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ చూడండి:అదిరే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లు