Prepaid Plans With No Daily Data Limit :దేశీయ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు.. తమ యూజర్ల కోసం అన్-లిమిటెడ్ ప్రీపెయిడ్ డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. ప్రతిరోజూ అపరిమిత డేటా ఉపయోగించే యూజర్లకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ప్లాన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జియో రూ.296 ప్లాన్
Jio 296 Plan Benefits :ఈ రూ.296రిలయన్స్ జియో ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డైలీ లిమిట్ లేని డేటా కావాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఈ ప్లాన్‌తో 25 GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లను ఉచితంగా వాడుకోవచ్చు. FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) ద్వారా అపరిమిత 5జీ డేటా కూడా వాడుకోవచ్చు.
Jio 296 Plan Benefits :జియో ఇదే తరహా ఆఫర్లతో మరో ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఆ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదే రూ.239 ప్లాన్. ఈ జియో ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు రోజువారీగా 1.5 GB డేటా లభిస్తుంది. కానీ, ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5జీ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. జియో అధికారిక వెబ్సైట్ లేదా మైజియో యాప్ చూడండి.
భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ అన్ లిమిటెడ్ ప్లాన్
Airtel Unlimited Data Plans 2023 : రిలయన్స్ జియో మాదిరిగానే ఎయిర్టెల్ కూడా రోజువారి అపరిమిత డేటాతో, 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్ తీసుకువచ్చింది. బల్క్ డేటా ప్లాన్ కింద రోజువారీ అపరిమిత డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. అదే విధంగా బండిల్డ్ డేటా బెనిఫిట్స్ కల్పిస్తోంది. అంటే యూజర్లు తమకు నచ్చిన ఏ సమయంలోనైనా వారు కోరుకున్నంత డేటా వినియోగించేలా ఆప్షన్ ఇస్తోంది.