Jio laptop price in India : రిలయన్స్ జియో తన మొట్టమొదటి ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. జియో బుక్‌గా వ్యవహరించే దీనిని గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్‌లో రూ.19,500 ఆఫర్ ధరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది జీఈఎం పోర్టల్‌లోనే అందుబాటులో ఉంది. అందువల్ల అందరూ దీనిని కొనే వీల్లేదు. కేవలం ప్రభుత్వ విభాగాలు మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. దీపావళి నాటికి సాధారణ ప్రజానీకానికి కూడా దీనిని అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ధర ఇంతే ఉంటుందా? లేదా? అనేది చూడాలి. కాగా.. ఇప్పటికే ఇండియా మొబైల్ కాంగ్రెస్- 2022లోనూ జియో బుక్‌ను ప్రదర్శించారు.
జియో బుక్ ప్రత్యేకతలు ఇవీ..
Jio laptop features : జీఈఎం పోర్టల్‌లో ఉన్న వివరాల ప్రకారం..
- 11.6 అంగుళాల హెచ్‌డీ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ యాంటీ-గ్లేర్ తెర. ఇది నాన్‌టచ్. రిజల్యూషన్ 1366X767 పిక్సెల్స్
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో కూడిన ఈ జియో బుక్.. జియోఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది.
- 2 జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. ర్యామ్‌ను పెంచుకునే సదుపాయం లేదు.
- యూఎస్‌బీ 2.0 పోర్ట్, 3.0 పోర్ట్, హెచ్‌డీఎంఐ పోర్ట్ ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్స్ ఇందులో లేవు. అయితే మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ ఉంది.
- బ్లూటూత్, 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీకి వీలుంది.
- రెండు ఇంటర్నల్ స్పీకర్లు, మైకోఫోన్లు ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ స్కానర్ లేదు.
- 55.1- 60ఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ.
- 1.2 కిలోల బరువు. ఒక సంవత్సరం బ్రాండ్ వ్యారెంటీ