తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

JIO Bharat Amazon : 'జియో భారత్​' సేల్స్​ ప్రారంభం.. రూ.999కే అమేజింగ్ ఫీచర్స్​తో 4జీ ఫోన్​! - జియోభారత్ V2

JIO Bharat Sales In Amazon : రిలయన్స్ జియో​ కంపెనీ.. 'జియో భారత్​ కీప్యాడ్​ ఫోన్​' అమ్మకాలను ప్రారంభించింది. 4జీ సపోర్టుతో వచ్చే ఈ ఫోన్.. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్​సైట్​ అమెజాన్​లో లభిస్తుంది. మరి దీని ధర ఎంత? ఫీచర్స్​ సంగతేంటి? తదితర వివరాలు మీకోసం.

Jio Bharat Sales In Amazon
Jio Bharat In Amazon

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 3:54 PM IST

JIO Bharat Sales In Amazon : ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్​ జియో​ ఇటీవలే జియో భారత్​ కీప్యాడ్​ ఫోన్​ను విడుదల చేసింది. కాగా దీనికి సంబంధించిన అమ్మకాలను సోమవారం (ఆగస్టు 28) అమెజాన్​లో ప్రారంభించింది. ప్రతి ఒక్కరికి డిజిటల్​ సేవలను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చింది. పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి స్మార్ట్​ఫోన్లు కొనలేని వారి కోసమే ప్రత్యేకంగా జియో భారత్​ పేరుతో 4జీ మోడల్​ ఫోన్లను గత నెల 7న భారత మార్కెట్​లోకి తీసుకువచ్చింది.

2జీ ముక్త్ భారత్​
రిలయన్స్​ అధినేత ముకేశ్ అంబానీ '2జీ ముక్త్ భారత్'​ లక్ష్యంగా తాము ఈ నయా జియో భారత్​ ఫోన్​ను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఇంటర్నెట్​ ఎనేబుల్డ్​ 4జీ ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్​ను కేవలం రూ.999 ( JIO Bharat Phone 999 )కే అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెజాన్​తో పాటు రిటైల్​ అవుట్​లెట్​ స్టోర్స్​లో కూడా ఈ 4జీ కీప్యాడ్​ ఫోన్​ సేల్స్​ను ప్రారంభించారు. మరి ఈ నయా కీప్యాడ్​ ఫోన్​లోని స్పెక్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..

JIO Bharat Features And Specifications :జియో భారత్​ 4జీ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్​లో 4జీ ఇంటర్నెట్​ కనెక్టివిటీ సహా మరెన్నో ఫీచర్స్​ ఉన్నాయి.

స్పెక్స్​ అండ్​ ఫీచర్స్..!

  • 3.5mm ఆడియో ఫోన్​ కనెక్టర్​
  • బ్యాటరీ- 1000mAh బ్యాటరీ
  • కెమెరా- 0.3 మెగాపిక్సెల్​
  • ఒక్క ఛార్జ్​తో 24 గంటల పవర్​ బ్యాకప్​
  • స్టోరేజ్​- 128జీబీ స్టోరేజ్​ సపోర్ట్ (ఎస్​డీ కార్డు)
  • డిస్​ప్లే- 1.77 అంగుళాల QVGA TFT డిస్​ప్లే

ఎక్స్​ట్రా ఫీచర్స్..!
JIO Bharat Features :క్లాసిక్​ బ్లాక్​ కలర్​లో లాంఛ్​ చేసిన ఈ జియో భారత్​ ఫోన్​ హెచ్​డీ కాలింగ్​ను కూడా​ సపోర్ట్​ చేస్తుంది. జియోపే యాప్​ ద్వారా సులువుగా యూపీఐ పేమెంట్స్​ చేసుకునే సౌలభ్యం కూడా ఇందులో ఉంది. ముఖ్యంగా జియో సినిమా, స్పోర్ట్స్​ లాంటి ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ను యాక్సెస్​ చేసుకునే వీలును ఇందులో కల్పించారు. జియో సావన్​ యాప్​ ద్వారా వేలాది పాటలను వినవచ్చు.

జియోభారత్​ V2, జియో భారత్​ K1 కార్బన్​ పేర్లతో రెండు సిరీస్​లలో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్​లో కేవలం జియో సిమ్​ను మాత్రమే వినియోగించాలి. మొత్తం 23 ప్రాంతీయ భాషలను ఇది​ సపోర్ట్​ చేస్తుంది. కాగా ఇందులో ప్రీ-ఇన్​స్టాల్డ్ జియో యాప్స్​ ఉంటాయి.

ప్లాన్స్​ వివరాలు..!
Amazon JIO Recharge : రీఛార్జ్​ ప్లాన్స్​ విషయానికి వస్తే.. 28 రోజుల ప్లాన్​ వ్యాలిడిటీతో యూజర్లు రూ.123 నెలవారీ ప్లాన్​ను తీసుకుంటే.. అన్​లిమిటెడ్​ కాల్స్​తో పాటు, 14జీబీ డేటా(రోజుకు 0.5జీబీ ఇంటర్నెట్)ను పొందవచ్చు.

ABOUT THE AUTHOR

...view details