తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Jio Bharat Phone Sale : 'జియో భారత్' సేల్స్ స్టార్ట్.. రూ.999కే అదిరే ఫీచర్స్​తో 4జీ మొబైల్​! - phones under 1000 in india 2023

Jio Bharat phone sale in India : ముఖేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో జులై 7న భారత మార్కెట్​లో జియో భారత్​ వీ2 4జీ ఫోన్ల అమ్మకాలు ప్రారంభించింది. '2జీ ముక్త్ భారత్'​ లక్ష్యంగా తాము కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నయా 4జీ ఫోన్​లోని స్పెక్స్​, ఫీచర్స్ ఏమిటో చూద్దాం రండి.

Jio Bharat phone sale starts in India
Bharat phone sale in India to start July 7

By

Published : Jul 7, 2023, 1:11 PM IST

Updated : Jul 7, 2023, 1:40 PM IST

Jio Bharat phone sale starts in India : రిలయన్స్​ జియో శుక్రవారం ఇండియన్​ మార్కెట్​లో 'జియో భారత్​ 4జీ' ఫోన్​ అమ్మకాలు ప్రారంభించింది.​ ఇంటర్నెట్​ ఎనేబుల్డ్​ 4జీ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్​ ధర కేవలం రూ.999 మాత్రమే.

ముఖేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కంపెనీ.. అతి తక్కువ ధరకే, ప్రీపెయిడ్​ ప్లాన్స్​తో ఈ బడ్జెట్​ ఫోన్​ను తీసుకొచ్చింది. 2జీ యుగంలో చిక్కుకుపోయిన వినియోగదారులను.. 4జీ టెక్నాలజీకి అప్​గ్రేడ్ చేయడమే లక్ష్యంగా దీనిని తీసుకొస్తున్నట్లు జియో వెల్లడించింది. '2జీ ముక్త్​ భారత్​' లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది.

తొలి దశలో 1 మిలియన్​ ఫోన్స్​!
రిలయన్స్ జియో మొదటి దశలో 1 మిలియన్ జియో భారత్​​ ఫోన్​లను విక్రయించాలని నిర్ణయించింది. ఇక రీఛార్జ్​ ప్లాన్స్​ విషయానికి వస్తే.. యూజర్లు రూ.123 నెలవారీ ప్లాన్​ను తీసుకుంటే.. అపరిమిత కాల్స్​తో పాటు, 14జీబీ డేటాను పొందవచ్చు. రూ.1234 వార్షిక రీఛార్జ్​ ప్లాన్ తీసుకుంటే... అన్​లిమిటెడ్​ కాల్స్​ + రోజుకు 0.5జీబీ డేటా చొప్పున మొత్తంగా 168జీబీ డేటా వినియోగించుకోవచ్చు.​

జియో భారత్ ఫోన్​ అమ్మకాలు ప్రారంభం

జియో భారత్​ వీ2 4జీ ఫోన్​ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్​​
jio Bharat phone specifications : జియో భారత్​ వీ2 4జీ పేరుతో వస్తున్న ఈ ఫోన్​లో 4జీ ఇంటర్నెట్​ కనెక్టివిటీ సహా మరెన్నో ఫీచర్స్​ ఉంటాయి.

  • డిస్​ప్లే : 1.77 అంగుళాల QVGA TFT డిస్​ప్లే
  • బ్యాటరీ : 1000mAh బ్యాటరీ
  • కెమెరా : 0.3 మెగాపిక్సెల్​ కెమెరా
  • స్టోరేజ్​ :128జీబీ స్టోరేజ్ సపోర్ట్ (ఎస్​డీ కార్డు)

jio Bharat phone features : ఈ జియో భారత్​ 4జీ ఫోన్​లో.. హెడ్​ఫోన్​ జాక్​, టార్చ్​, ఎఫ్​ఎం రేడియో లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఈ​ ఫోన్​లోని జియోపే యాప్​ ద్వారా సులువుగా యూపీఐ పేమెంట్స్​ చేసుకోవచ్చు. అలాగే జియో సినిమా, స్పోర్ట్స్​ చూడవచ్చు. జియో సావన్​ యాప్​ ద్వారా వేలాది పాటలు వినవచ్చు.

జియో భారత్ ఫోన్​ ద్వారా పేమెంట్స్​

ఫ్రీ అండ్ కాంప్లిమెంటరీ ఫోన్స్​!
రిలయన్స్​ జియో వివిధ రాష్ట్రాల్లో, ప్రదేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి, కొంత మంది వ్యక్తులకు కాంప్లిమెంటరీగా జియో భారత్​ ఫోన్లను అందించింది. మరి కొంత మందికి తన జియోస్టోర్​ల ద్వారా కేవలం రూ.700కే జియోఫోన్​ను విక్రయించింది.

రూ.999కే అదిరే ఫీచర్స్​తో జియో 4జీ ఫోన్​

ప్రపంచం మొత్తం 5జీ విప్లవానికి సిద్ధమవుతుంటే.. భారత్​లో ఇంకా చాలా మంది 2జీలోనే ఇరుక్కుపోయారు. అలాంటి వారికి 4జీ నెట్​వర్క్​ను పరిచయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రిలయన్స్​ జియో అధినేత ముఖేశ్​ అంబానీ పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధి, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు సాంకేతికత ఎంతో అవసరమని, అందుకే హైస్పీడ్​ ఇంటర్నెట్​ను ప్రజలందరికీ చేరువ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Last Updated : Jul 7, 2023, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details