Jio AirFiber Plans And Airtel Xstream Fiber Plans : భారతదేశంలో నేడు 5జీ ఎరా నడుస్తోంది. అందుకే ప్రముఖ టెలికాం కంపెనీలు అన్నీ యూజర్లను అకట్టుకునేందుకు.. పలు స్పెషల్ ఫీచర్లతో డేటా ప్లాన్లను అందించడానికి పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ రేసులో ముందున్నాయి. తమ ఎయిర్‌ఫైబర్ డేటా ప్లాన్లపై.. పూర్తి ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ-హాట్ స్టార్, సోనీ లివ్, జీ5 సహా పలు ఓటీటీ సబ్స్క్రిప్షన్లను అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం ఆ ప్లాన్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.
Jio AirFiber Plans : రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం సరికొత్త ఎయిర్‌ఫైబర్ ప్యాకేజ్‌లను తీసుకొచ్చింది. ఈ డేటా ప్యాకేజ్‌ల ద్వారా తమ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ-హాట్‌స్టార్ లాంటి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్‌ను పూర్తి ఉచితంగా అందిస్తోంది. అవి ఏమిటంటే..
Jio AirFiber 1199 Plan :
- ఈ నెలవారీ ప్లాన్ తీసుకున్నవారికి 100 Mbps స్పీడ్‌తో ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
- 550+ డిజిటల్ ఛానల్స్ ఉచితంగా చూడవచ్చు.
- నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ-హాట్‌స్టార్, జియో సినిమా ప్రీమియం లాంటి పలు ఓటీటీ ప్లాట్ఫాంల్లోని కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు.
Jio AirFiber Max 1499 Plan :
- ఈ 30 రోజుల ప్లాన్ తీసుకున్నవారికి 300 Mbps స్పీడ్‌తో ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పిస్తారు. అయితే ప్రస్తుతం దీన్ని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు.
- 550+ డిజిటల్ ఛానల్స్ ఫ్రీగా వీక్షించవచ్చు.
- నెట్‌ఫ్లిక్స్ బేసిక్, ప్రైమ్ వీడియో, డిస్నీ-హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 సహా ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను ఫ్రీగా పొందవచ్చు.
Jio AirFiber Max 2499 Plan :
- ఈ నెలవారీ ప్లాన్ తీసుకున్నవారికి 500 Mbps సూపర్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పిస్తారు.
- ఫ్రీగా 550+ డిజిటల్ ఛానల్స్ చూడవచ్చు.
- నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, ప్రైమ్ వీడియో, డిస్నీ-హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 సహా ఇతర ఓటీటీ ప్లాట్‌ఫాం సబ్స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తారు.