Jio AirFiber Launch : దేశంలో ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో .. రిలయన్స్ జియో సెప్టెంబర్ 19న సరికొత్త జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రస్తుతానికి ఇది హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, పుణె నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే త్వరలోనే దీనిని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది.
జియో ఎయిర్‌ఫైబర్ - లక్ష్యాలు
- దేశంలోని ప్రతీచోట ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం.
- ప్రతి ఇల్లు, ప్రతీ చిన్న వ్యాపారం సహా భారతదేశం మొత్తాన్ని ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా మార్చడం.
- టీవీ లేదా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు అందరూ నాణ్యమైన సర్వీస్‌లు పొందేలా అప్‌గ్రేడ్ కావడానికి జియో ఎయిర్‌ఫైబర్ సహకరిస్తుంది.
- జియో ఎయిర్‌ఫైబర్ ప్రధానంగా.. ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్టైన్మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్
యూజర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. జియోఫైబర్ వేరు.. జియో ఎయిర్‌ఫైబర్ వేరు. ఈ రెండింటి ప్లాన్లు కూడా భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం రిలయన్స్ జియో రెండు రకాల జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అవి:
- జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్
- Vanilla జియో ఎయిర్‌ఫైబర్
Jio AirFiber Max Plans : దీనిలో ప్రధానంగా మూడు ప్లాన్లు ఉన్నాయి. ఇవి అన్నీ అపరిమితమైన డేటాను అందిస్తాయి. అవి:
1. రూ.1499 ప్లాన్ : ఈ ప్లాన్‌లో 300 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
2. రూ.2499 ప్లాన్ :ఈ ప్లాన్‌లో 500 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
3. రూ.3,999 ప్లాన్ : ఈ ప్లాన్‌లో 1000 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
నోట్ :ఈ మూడు ప్లాన్స్‌లోనూ 550+ డిజిటల్ ఛానల్స్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రైమ్ సహా 16 ఓటీటీ యాప్స్ లభిస్తాయి. ముఖ్యంగా ఈ జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి.. రిలయన్స్ జియో కంపెనీ 4కె సెట్-టాప్ బ్యాక్స్, వాయిస్ యాక్టివ్ రిమోట్, రౌటర్ అందిస్తుంది.
జియో ఎయిర్‌ఫైబర్ - ప్లాన్స్
జియో ఎయిర్‌ఫైబర్‌లో మూడు సాధారణ ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా అపరిమితమైన డేటా ఫెసిలిటీ కలిగి ఉంటాయి.
1. రూ.599 ప్లాన్ :ఈ ప్లాన్‌లో 30 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది. దీనిలో 550+ డిజిటల్ ఛానల్స్, 14 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది.