తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

అంతరిక్షంలో అద్భుతం 'కార్ట్​వీల్​ గెలాక్సీ'.. జిమ్నాస్టిక్స్​ చేస్తున్నట్లుగా గిరగిరా.. - Cartwheel galaxy images

James Webb Space Telescope: విశ్వం లోగుట్టును తెలుసుకునేందుకు నాసా పంపిన జేమ్స్‌వెబ్ స్పేస్ టెలిస్కోప్​ అంతరిక్ష అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అలా పరిచయం చేసిన మరో అద్భుతమే కార్ట్‌వీల్ గెలాక్సీ. భూమికి ఐదువందల కాంతి సంవత్సరాల దూరంలో గిరగిరా తిరుగుతూ ఉన్నట్లుగా ఉండే ఈ గెలాక్సీ ఫోటోలను జేమ్స్‌ వెబ్ అద్భుతంగా చిత్రీకరించింది. ఆ ఫోటోలను నాసా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 4, 2022, 3:42 PM IST

James Webb Space Telescope: విశ్వ రహస్యాలను ఛేదించేందుకు నాసా పంపిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్​ అంతరిక్షంలోని అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ప్రపంచానికి పరిచయం చేసిన మరో అద్భుతం కార్ట్‌వీల్ గెలాక్సీ. జిమ్నాస్టిక్స్ చేసే గెలాక్సీ అని దీనిని శాస్త్రవేత్తలు పిలుస్తుంటారు. దీపావళి రోజున చిన్నారులు కాల్చే భూ చక్రం మాదిరిగా అంతరిక్షంలో గిరగిరా తిరుగుతున్నట్లు కనిపించే ఈ కార్ట్ వీల్ గెలాక్సీని నాసా జేమ్స్‌ వెబ్ అద్భుతంగా ఫోటోలు తీసింది. ఆ ఛాయాచిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా షేర్ చేసింది.

కార్ట్ వీల్ గెలాక్సీని ఫోటోలు తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
జిమ్నాస్టిక్స్ చేసే గెలాక్సీ అని పిలుస్తున్న శాస్త్రవేత్తలు

భూమి నుంచి ఐదువందల మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఈ కార్ట్‌వీల్ గెలాక్సీ ఉంటుంది. ఓ పెద్ద గెలాక్సీ మరో చిన్న పాలపుంత ఢీకొనడం ద్వారా ఈ గెలాక్సీ ఏర్పడింది. కార్ట్‌వీల్ గెలాక్సీ మొత్తం 440 మిలియన్ సంవత్సరాలు విస్తరించి ఉంది. లోపల రింగ్ నుంచి వస్తున్న రేడియంట్ ఎనర్జీ కారణంగా ఔటర్ రింగ్ విస్తరిస్తూ వెళుతూనే ఉంది. ఫలితంగా ఔటర్ రింగ్ సమీపంలో నక్షత్రాలు, సూపర్ నోవాలు ఉద్భవిస్తున్నాయి.

అద్భుతాలను పరిచయం చేస్తున్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్

Cartwheel Galaxy Images: ఈ కార్ట్ వీల్ గెలాక్సీని హబుల్ స్పేస్ టెలిస్కోప్ 2018లోనే ఫోటోలు తీసింది. అయితే ధూళికణాల కారణంగా సరిగ్గా కనిపించలేదు. ప్రస్తుతం ఇన్‌ఫ్రారెడ్ కిరణాలతో పనిచేసే జేమ్స్‌ వెబ్ టెలిస్కోప్‌ తీసిన ఫోటోలో కార్ట్‌వీల్ గెలాక్సీ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జేమ్స్‌ వెబ్ టెలిస్కోప్‌లోని మిడ్‌ ఇన్‌ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్ ఆ గెలాక్సీ నుంచి వస్తున్న కాంతిని సైతం అధ్యయనం చేసింది. ఆ గెలాక్సీలో హైడ్రోకార్బన్లు పుష్కలంగా ఉన్నాయని గుర్తించింది. ఇదే సమయంలో భూమి మీద ఉన్నట్లుగా సిలికేట్ డస్ట్ ఆ గెలాక్సీ నుంచి వస్తున్న కాంతిలో ఉన్నట్లు గుర్తించింది. జేమ్స్ వెబ్ తీసిన ఫోటోల ఆధారంగా గెలాక్సీలు, నక్షత్రాల పుట్టుకతో పాటుగా భూమి లాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు అవకాశం కలుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details