తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

కొత్త ప్రైవసీ పాలసీలపై వాట్సాప్​కు కేంద్రం వార్నింగ్! - వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీల విషయంలో కేంద్రం షాక్​

WhatsApp new privacy policy issue
వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీల వివాదం

By

Published : May 19, 2021, 2:16 PM IST

Updated : May 19, 2021, 3:07 PM IST

14:12 May 19

వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీకి కేంద్రం నో

ఇటీవల అమలులోకి తెచ్చిన నూతన ప్రైవసీ పాలసీలను ఉపసంహరించుకోవాలని వాట్సాప్​ను కేంద్రం ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై ఎలక్ట్రానిక్​, ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్​కు లేఖ రాసినట్లు తెలిపాయి. దీనిపై స్పందించేందుకు వాట్సాప్​కు ఏడు రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొన్నాయి. ఈలోపు సరైన సమాధానం రాకుంటే అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించినట్లు వివరించాయి.

నూతన ప్రైవసీ పాలసీల విషయంలో వాట్సాప్​ భారతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు కేంద్రం పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త నిబంధనలు యూజర్ల గోప్యతకు, భారతీయ వినియోగదారుల హక్కులను భంగం కలిగించే విధంగా ఉన్నాయని అభిప్రాయపడినట్లు వివరించాయి.

Last Updated : May 19, 2021, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details