తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

IPhone Offers In October 2023 : ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ పండుగ సేల్​లో.. రూ.40 వేలకే ఐఫోన్​ 13.. రూ.20,000 డిస్కౌంట్​తో ఐఫోన్​ 14! - IPhone 12 Offers In amazon

IPhone Offers In October 2023 In Telugu : మీరు సరికొత్త ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్​ రూ.30,000 నుంచి రూ.40,000 మధ్యలోనే ఉందా? అయితే ఇది మీ కోసమే. ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్ డేస్​ సేల్​, అమెజాన్​ గ్రేట్ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో ఐఫోన్స్​పై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్​ లభిస్తున్నాయి. వాటి పూర్తి వివరాలు మీ కోసం..

iphone offers in flipkart
iphone offers in october 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 12:27 PM IST

IPhone Offers In October 2023 : అమెజాన్ - 'గ్రేట్​ ఇండియన్ ఫెస్టివల్​', ఫ్లిప్​కార్ట్ -​ 'బిగ్​ బిలియన్ డేస్'​ సేల్స్​ అక్టోబర్​ 8 నుంచి అక్టోబర్​ 15 వరకు జరగనున్నాయి. ఈ మెగా సేల్​లో అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లు.. ఐఫోన్​ 12, ఐఫోన్​ 13, ఐఫోన్​ 14లపై అదిరిపోయే ఆఫర్స్​, డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ 13పై అదిరిపోయే ఆఫర్స్​!
IPhone 13 Offers In Flipkart : ప్రముఖ దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం (వాల్​మార్ట్​ ఆధ్వర్యంలో పనిచేస్తుంది) ఫ్లిప్​కార్ట్​.. ఐఫోన్స్​పై భారీ డిస్కౌంట్స్​ ప్రకటించింది. వీటిని ఉపయోగించి సరికొత్త ఐఫోన్​ను మీరు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 13 ధర రూ.52,499గా ఉంది. కానీ ఫ్లిప్​కార్ట్ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో దీనిని కేవలం రూ.30,600కే దక్కించుకోవచ్చు. అది ఎలా అంటే.. ఐసీఐసీఐ, కోటక్​ బ్యాంక్ క్రెడిట్​ కార్డ్ ఉపయోగించి.. ఐఫోన్ 13 కొనుగోలు చేస్తే 10% ఇన్​స్టాంట్​ డిస్కౌంట్​ లభిస్తుంది. ఒకవేళ మీరు ఫ్లిప్​కార్ట్ యాక్సిస్​ బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే 5% వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. మీరు గనుక పాత ఐఫోన్​ను ఎక్స్ఛేంజ్​ చేస్తే.. అప్పుడు ఐఫోన్​ కేవలం రూ.30,600కే దక్కుతుంది.

ఐఫోన్​ 13

IPhone 13 Offers In Amazon : అమెజాన్​ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ సేల్​లో ఐఫోన్ 13పై బంపర్ ఆఫర్స్​, డిస్కౌంట్స్​ అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే కిక్​స్టార్టర్ డీల్స్ గురించి చెబుతూ ఐఫోన్ ప్రేమికులను బాగా ఊరిస్తోంది. అమెజాన్ ఈ గ్రేట్ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో ఐఫోన్ 13ను కేవలం రూ.40,000కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎలా అంటే.. ఎస్​బీఐ క్రెడిట్​, డెబిట్ కార్డ్ ఉపయోగించి ఐఫోన్ 13 కొనుగోలు చేస్తే 10 శాతం వరకు ఇన్​స్టాంట్​ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు మంచి వర్కింగ్ కండిషన్​లో ఉన్న పాత స్మార్ట్​ఫోన్​ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. మరింత మేరకు ధర తగ్గుతుంది. ఫలితంగా మీకు రూ.40,000 కంటే తక్కువకే ఐఫోన్​ 13 లభిస్తుంది.

ఐఫోన్​ 14 సిరీస్​ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!
IPhone 14 Offers In Flipkart :ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో..​ ఐఫోన్​ 14, ఐఫోన్​ 14 ప్లస్​, ఐఫోన్ 14 ప్రో మొబైల్స్​ను భారీ తగ్గింపు ధరతో అందించనుంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం, దాదాపు రూ.20,000 వరకు డిస్కౌంట్ అందించనుంది. దీనికి తోడు బ్యాంక్ ఆఫర్లను కూడా అప్లై చేస్తే, మరింత తక్కువ ధరకే ఐఫోన్​ 14 సిరీస్​ మొబైల్​ను దక్కించుకోవచ్చు. ఒక అంచనా ప్రకారం ఐఫోన్​ 14 రూ.50,000కు, ఐఫోన్​ 14 ప్లస్​ రూ.60,000 ప్రైస్​ రేంజ్​లో ఉండవచ్చు. వాస్తవానికి కస్టమర్లు రూ.1999 చెల్లించి.. ప్రైస్​ లాక్​ చేసుకోవచ్చు. దీని వల్ల భవిష్యత్​లో ధరలు పెరిగినప్పటికీ.. ఇప్పుడు ఉన్న ధరకే, కచ్చితంగా ఐఫోన్​ 14ను సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్​ 14

IPhone 12 Offers In Flipkart :ఫ్లిప్​కార్ట్​ ఈ పండుగ సేల్​లో.. ఐఫోన్ 12ను కేవలం రూ.32,999కే అందుబాటులో ఉంచింది. ఎలా అంటే ప్రస్తుతం ఐఫోన్​ 12 ధర రూ.38,999గా ఉంది. దీనికి బ్యాంక్​ ఆఫర్లు అప్లై చేయాలి. అలాగే మీ దగ్గర ఉన్న పాత ఫోన్​ను ఎక్స్ఛేంజ్​ చేసుకోవాలి. అప్పుడు ఐఫోన్​ 12 మీ సొంతం అవుతుంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. అమెజాన్​ గ్రేట్ ఇండియన్​ ఫెస్టివల్​లో కూడా ఐఫోన్​ 14 సిరీస్​ ఫోన్లపై భారీ డిస్కౌంట్​ అందించే అవకాశం ఉంది.

Amazon Great Indian Festival 2023 : స్మార్ట్​ఫోన్స్​పై 49%, ల్యాప్​టాప్స్​పై 45% వరకు డిస్కౌంట్​.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ కిరాక్​ డీల్స్​​!

Most Affordable Automatic Cars In 2023 : రూ.8 లక్షల బడ్జెట్లో.. మంచి ఆటోమేటిక్ కార్ కొనాలా?.. మార్కెట్​లోని బెస్ట్ ఆప్షన్స్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details