Complaints on Apple iPhone 15 Series: ఐ-ఫోన్‌కు ఉన్న క్రేజ్ ఏపాటిదో.. మొబైల్ లవర్స్‌ను అడిగితే చెపుతారు. ఆ హ్యాండ్ సెట్‌ను సుతారంగా చేతిలోకి తీసుకోవాలని ఆరాటపడే వారికి అంతే ఉండదంటే నమ్మాల్సిందే. భద్రతా ఫీచర్లకు పెద్దపీట వేస్తూ అధునాతన స్పెసిఫికేషన్స్‌తో వచ్చే యాపిల్ ఫోన్స్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. అసలు.. యాపిల్ ఫోన్ చేతిలో ఉండడమే ఓ హోదాగా ఫీలవుతూ ఉంటారు కొందరు!
Apple iPhone 15 Series Full Details in Telugu:ఈ క్రమంలోనేసిరీస్‌ను అప్‌డేట్ చేస్తూ "ఐఫోన్ 15"ను సెప్టెంబర్ 22న మార్కెట్లోకి విడుదల చేశారు నిర్వాహకులు. శుక్రవారం ఉదయం అమ్మకాలు మొదలు పెట్టగా.. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఎప్పుడెప్పుడు ఐ ఫోన్ అందుకుందామా.. అని ఎదురు చూశారు. తీరా చేతిలోకి వచ్చిన ఫోన్ చూసి అవాక్కయ్యారు. తమ ఆశలను అడియాసలు చేసిందంటూ ఫీలవుతున్నారు.
Apple iPhone 15 Series Sale : అదిరిపోయే ఆఫర్స్, డిస్కౌంట్స్‌తో.. ఐఫోన్ 15 సిరీస్ సేల్ ప్రారంభం
ఈ ఐఫోన్ 15 సిరీస్.. మన్నిక పరీక్షలో పేలవంగా పని చేసిందని, కలర్ కూడా సరిగా లేదని, ఇంకా ఇతర లోపాలు ఉన్నాయని.. కొనుగోలుదారులు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఎన్నో కలలతో కొత్త ఐఫోన్ కొనుగోలు చేస్తే.. ఆ సంతోషం కాసేపు కూడా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు పోసి కొనుగోలు చేసిన ఫోన్ ఇలా కావడంతో.. ఏం జరుగుతుంది? కంపెనీ ఎలాంటి సమాధానం ఇస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- "మొదటి ఐఫోన్ 15 ప్రో డ్రాప్ టెస్ట్ గత సంవత్సరం ఐఫోన్ 14 ప్రో కంటే అధ్వాన్నమైన మన్నికను చూపుతోందట. ఈ కొత్త ఫోన్లో కర్వ్, ఎడ్జెస్.. స్ట్రెయిట్ ఎడ్జ్ డిజైన్ కంటే పెళుసుగా కనిపిస్తున్నాయి" అని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- కొన్ని సెకన్ల పాటు స్క్రీన్‌పై గీతలు వచ్చాయని మరొకరు కంప్లైంట్ చేశారు.
- "ఐఫోన్ 15 ప్రో కొన్ని యూనిట్లు లోపభూయిష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కలరింగ్ సరిగా లేదు. అంతేకాకుండా స్క్రీన్ అంచులతో సరిగ్గా అలైన్ చేయలేదు" అని మరో యూజర్ X(ట్విటర్)లో షేర్ చేశారు.
- కొన్ని నివేదికలు కొత్త ఫోన్‌ను 'ఫింగర్ ప్రింట్ మాగ్నెట్'గా పేర్కొన్నాయి.
- యాపిల్ కంపెనీ సపోర్ట్.. తన సమాచారంలో ఈ విషయాన్ని పేర్కొంది.
Apple iOS 17 Release : స్టన్నింగ్ ఫీచర్లతో.. iOS 17 రిలీజ్.. అప్‌డేట్ చేసుకోండిలా!
Iphone 15 Battery Life Charging Speed : ఐఫోన్ 15 సిరీస్ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్‌పై టెక్ లవర్స్ అసంతృప్తి!..
IPhone Discount Sale : ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 14, ఐఫోన్ 13లపై అదిరిపోయే డిస్కౌంట్స్!