తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఐఫోన్ 15 సిరీస్‎లో సంచలన మార్పులు.. ఈ ఒక్క ఫీచర్‎తో మార్కెట్ షేక్! - ఐఫోన్ లాంఛింగ్ డేట్

Iphone 15 Charging Port : దేశంలో ఇంటర్నెట్ విప్లవంతో మొబైల్ ఫోన్ల వినియోగం తారస్థాయికి చేరుకుంది. ప్రతి ఒక్కరి చేతుల్లోకి ఫోన్ వచ్చి పడింది. అయితే వీటిల్లో చాలా వరకు బడ్జెట్ ఫోన్లే ఉంటాయి. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాల్లో బడ్జెట్ ఫోన్లనే ప్రజలు అధికంగా వినియోగిస్తుంటారు. అయితే అందరి డ్రీమ్ ఫోన్ మాత్రమే ఒకటే. అదే యాపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్. మరి ఐఫోన్​లో వచ్చే కొత్త ఫీచర్లు, మార్పులు ఏంటో తెలుసుకుందాం.

iphone 15 charging port
iphone 15 charging port

By

Published : May 23, 2023, 2:40 PM IST

Iphone 15 Charging Port : ఐఫోన్ ధర ఆకాశాన్ని అంటుతున్నా దీన్ని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా యువతకు ఇదో స్టేటస్ సింబల్‎గా మారిపోయింది. చేతిలో ఐఫోన్ ఉంటే అదో గొప్ప అన్నట్లు తయారైంది. ఈ ఫోన్‎లో ఉండే ఫీచర్లతో ఉండే మొబైల్స్‎ను చౌక ధరకు అందించే ఇతర బ్రాండ్లు ఉన్నప్పటికీ ఎందుకో యాపిల్ ఫోన్లే కావాలంటారు యూజర్లు. ఇకపోతే, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు కొత్తగా అప్​గ్రేడై రానున్నాయి.

నాన్-ప్రో ఐఫోన్స్‎లో కొత్త చిప్ సెట్, 48 మెగాపిక్సల్ కెమెరాను చేరుస్తున్నారు. అలాగే ప్రో మ్యాక్స్ మోడల్‎లో కొత్త పెరిస్కోప్ కెమెరాను జత చేస్తున్నారు. వీటన్నింటి కంటే కూడా ఐఫోన్ 15 సిరీస్‎లో రానున్న కొత్త అప్ గ్రేడ్ ఏంటంటే.. కొత్త ఛార్జింగ్ పోర్ట్. సోషల్ మీడియాలో వస్తున్న లీక్స్‎ను బట్టి ఐఫోన్ 15 సిరీస్ కొత్త ఫోన్లలో పాత లైట్నింగ్ పోర్ట్ స్థానంలో ఛార్జింగ్ కోసం యూఎస్​బీ-సీ పోర్ట్‎తో రానున్నాయట. ఐఫోన్ 15 సిరీస్‎లో రానున్న మరిన్ని మార్పులుచేర్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్ 15 యూఎస్బీ-సీ ఛార్జింగ్ స్పీడ్
కొంత మంది విశ్లేషకులు చెబుతున్న ప్రకారం.. త్వరలో రాబోయే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ప్రోమ్యాక్స్‎లో యూఎస్​బీ-సీ పోర్ట్ ఉంటుందట. ప్రో మోడల్స్ ఫోన్లలో మాత్రమే థండర్ బోల్ట్‌ పోర్ట్ ఉంటుందని యాపిల్ అనలిస్ట్ మింగ్ చి తెలిపారు. దీని వల్ల ఆ మోడల్ ఫోన్లలో వేగవంతమైన డేటా ట్రాన్స్​ఫర్​కు సౌలభ్యం ఉంటుందని చెప్పారు. 'మేడ్ ఫర్ ఐఫోన్' చొరవలో భాగంగా యాపిల్ మొబైల్స్‎లో ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. దీని వల్ల మార్కెట్‎లో దొరికే చౌక కేబుల్స్‎తో ఐఫోన్లను ఛార్జింగ్ చేయడం ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ ఆ కేబుల్స్‎తో ఛార్జింగ్ చేసినా డేటా ట్రాన్స్​ఫర్​ రేట్ చాలా తక్కువగా ఉంటుంది.

యాపిల్ గనుక ఐఫోన్ 15 సిరీస్‎లో యూఎస్​బీ-సీ పోర్ట్ ఫీచర్‎ను అందుబాటులోకి తీసుకొస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్న యూఎస్ బీ-సీ పోర్ట్ ఫీచర్.. యాపిల్ ఫోన్లలోకి కూడా వచ్చేసినట్లు అవుతుంది. ఇలాంటి ఫీచర్‎తో వచ్చే తొలి యాపిల్ సిరీస్ మోడల్ మొబైల్‎గా ఐఫోన్ 15 నిలిచిపోతుంది. అయితే ఇప్పటికే యాపిల్ ఉత్పత్తులైన మ్యాక్ బుక్స్, ఐమ్యాక్స్, ఐపాడ్స్‎తో పాటు యాపిల్ టీవీకి వాడే సిరి రిమోట్‎లో యూఎస్​బీ-సీ పోర్ట్‎ను ఇస్తుండటం గమనార్హం.

ఛార్జింగ్ పోర్ట్‎తో సహా మరిన్ని ఫీచర్లు
కొత్త ఛార్జింగ్ పోర్ట్‎ను పక్కనబెడితే ఐఫోన్ 15 సిరీస్ మరికొన్ని అధునాతన ఫీచర్లతో రానుంది. ఐఫోన్ 15 ప్రోమ్యాక్స్‎లో కొత్తగా పెరిస్కోప్ కెమెరా సెన్సార్‎ను చేరుస్తున్నారు. ప్రోతో పాటు ప్రోమ్యాక్స్‎లో ఏ17 బయోనిక్ చిప్ సెట్‎ను జత చేస్తున్నారు. అంతేకాదు.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‎లో ప్రస్తుతం ఉన్న 12 మెగాపిక్సల్ కెమెరా స్థానంలో 48 ఎంపీ కెమెరాను చేరుస్తున్నారని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details