తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

iphone 13: ఐఫోన్-13 ఫీచర్స్​ లీక్.. మాములుగా లేవుగా! - ఐఫోన్ 13 ప్రో

ఐఫోన్ కొత్త సిరీస్​ కోసం ఎదురుచూస్తున్నారా? కొత్తగా ఏమేం ఫీచర్స్ ఉండబోతున్నాయో అని తెలుసుకోవాలని ఉందా? సెప్టెంబర్​లోనే విడుదలయ్యేందుకు అవకాశమున్న ఐఫోన్​ 13 సిరీస్ (iphone 13)​ ఫీచర్లు లీకయ్యాయి. వాటిపై ఓ లుక్కేయండి.

iphone 13
ఐఫోన్ 13

By

Published : Sep 10, 2021, 9:41 AM IST

ఏటా సెప్టెంబర్​-అక్టోబర్​లో విడుదలయ్యే ఐఫోన్​లపై ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. కొత్తగా వచ్చే సిరీస్, వాటిల్లో ఫీచర్స్ ఎలా ఉండనున్నాయనే ఉత్కంఠ నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదల కానున్న ఐఫోన్​ 13 సిరీస్​కు (iphone 13) సంబంధించి పలు ఫీచర్లు లీకయ్యాయి.

యాపిల్

సెప్టెంబర్​ 14న యాన్యువల్ ఫాల్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది టెక్ దిగ్గజం యాపిల్. ఈ ఈవెంట్​లో విడుదల చేసే వస్తువులపై సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ రోజున ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ సహా ఐఫోన్ 13 సిరీస్​ స్మార్ట్​ఫోన్​లను యాపిల్ లాంచ్ చేస్తుందనే ఊహాగానాలు వస్తున్నాయి. వాటి ఫీచర్లు, ధరలపై కొన్ని నివేదికలు ఇలా చెబుతున్నాయి..

ధర (అంచనా)

యాపిల్ హబ్​ అనే బ్లాగ్​ ప్రకారం ఐఫోన్ 13 సుమారు రూ.58,665 (800 డాలర్ల) లోపు ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్​ 24 నుంచి సేల్​ ప్రారంభం అవుతుందని అంచనా.

ఐఫోన్​ 13 సిరీస్

ఐఫోన్ 13 కలర్స్​

ఐఫోన్ 13 కలర్స్​ గురించిన సమాచారం బహిర్గతం కాలేదు. అయితే నలుపు, తెలుపు, ఆరెంజ్​ సహా పలు రకాల్లో అందుబాటులోకి ఉండబోతుందని తెలుస్తోంది.

ఐఫోన్ 13 డిస్​ప్లే

ఫేస్​ ఐడీ 2.0, అతి చిన్న నాచ్​తో 6.1 ఇంచ్ ఓలెడ్ డిస్​ప్లే ఉంటుందని అంచనా.

ఐఫోన్ 13

ఐఫోన్ 13 ప్రాసెసర్​ వివరాలు

64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజీ స్పేస్​తో ఏ15 బయోనిక్ సిస్టం-ఆన్-చిప్​ ప్రాసెసర్​తో రానుందని నివేదిక చెబుతోంది.

ఐఫోన్ 13 కెమెరా

వెనుకవైపు డయాగ్నోనల్​గా డ్యుయల్ కెమెరాతో ఐఫోన్ 13 వస్తుందని అంచనా. అందులో ఎఫ్​/1.8 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్​ ఉండనున్నాయి. ఈ సిరీస్​ ఆస్ట్రోఫొటోగ్రఫీ మోడ్​తో రాబోతుందని తెలుస్తోంది.

ఐఫోన్ 13 బ్యాటరీ, కనెక్టివిటీ వివరాలు

వైఫై 6ఈ, మెరుగైన 5జీ కనెక్టివిటీతో ఐఫోన్ 13 రానుందని సమాచారం. 24వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​ సాంకేతిక సపోర్ట్​తో 3,095ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది.

ఇదీ చూడండి:Iphone 13: సిగ్నల్​ లేకపోయినా ఫోన్​కాల్​ చేసుకోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details