తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2022, 8:21 AM IST

ETV Bharat / science-and-technology

ఐఫోన్ 13లో పింక్ స్క్రీన్‌ సమస్య.. యాపిల్‌ ఏమందంటే?

iPhone 13 pink screen: యాపిల్ ఐఫోన్​ 13 సిరీస్​లో పింక్ స్క్రీన్ సమస్య తలెత్తినట్లు కొందరు యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఉన్నట్టుండి ఫోన్ స్క్రీన్.. గులాబీ రంగులోకి మారుతోందని చెబుతున్నారు. దీనిపై యాపిల్ సంస్థ స్పందించింది.

iPhone 13 pink screen
iPhone 13 pink screen

iPhone 13 pink screen: యాపిల్‌ ఐఫోన్ 13 సిరీస్‌లో పింక్ స్క్రీన్ సమస్య ఇప్పుడు నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఉన్నట్టుండి తమ మొబైల్‌ స్క్రీన్ స్పష్టమైన కారణం లేకుండా గులాబీ రంగులోకి మారుతోందని కొంతమంది యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌, మొబైల్‌ రీసెట్‌ చేసినా సమస్య పరిష్కారం కావడం లేదంటున్నారు. పైగా మొబైల్‌ స్లో అవ్వడం, ఆటోమేటిక్‌గా రీస్టార్ట్‌ అవ్వడం వంటి కొత్త సమస్యలకు ఇది కారణమవుతోందని చెబుతున్నారు.

Apple on Pink screen issue

మరికొంతమంది మాత్రం సెట్టింగ్స్‌ రీసెట్‌ చేస్తే ఈ సమస్య మళ్లీ తలెత్తడం లేదని పేర్కొంటున్నారు. దీనిపై యాపిల్‌ స్పందించింది. తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపింది. అయితే, ఫోన్‌ స్టక్‌ అయినప్పుడు ఇటువంటి సమస్య తలెత్తొచ్చని పేర్కొంది.

అయితే, ఐఫోన్‌ 13 యూజర్లు షేర్‌ చేసిన చిత్రాలను గమనిస్తే.. డిస్‌ప్లే మొత్తం పూర్తిగా పింక్‌గా మారడం లేదు. డిస్‌ప్లేలో పలు ఐకాన్‌లు పాక్షికంగా కనిపిస్తున్నాయి. సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపం వల్ల ఈ సమస్య సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని టెక్‌ నిపుణుల అభిప్రాయం. రాబోయే అప్‌డేట్‌లో యాపిల్‌ ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావచ్చునని భావిస్తున్నారు. ముఖ్యంగా పింక్ స్క్రీన్ సమస్య ఎదుర్కొంటున్న వారు తమ డేటాను బ్యాకప్ చేసి తాజా ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్‌గ్రేడ్ చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, తాజా అప్‌డేట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని యాపిల్ పేర్కొనలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:సరికొత్త ఫీచర్​.. ఇన్​స్టాలో ఇక నెలనెలా సంపాదించుకోవచ్చు..!

ABOUT THE AUTHOR

...view details